తీసుకోవాల్సిన జాగ్రత్తలు | - | Sakshi
Sakshi News home page

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Published Mon, Mar 3 2025 12:02 AM | Last Updated on Mon, Mar 3 2025 12:04 AM

తీసుక

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

● గతంలో పూరిళ్లు, గడ్డివాములు అధికంగా అగ్నికి ఆహుతయ్యేవి. ఇప్పుడు ఎక్కువ ప్రమాదాలకు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌, గ్యాస్‌ లీకేజీ తదితరాలు కారణాలుగా నిలుస్తున్నాయి.

● నివాసాలు, పొలాల గట్లపైన ఉన్న గడ్డివాముల చుట్టూ కంచె నిర్మించుకోవడం మంచిది. వీటికి సమీపంలో పొగతాగడం, చుట్ట, సిగరెట్‌, బీడీ వంటివి ఆర్పకుండా పారేయడం ప్రమాదకరం.

● ఎండుగడ్డిని ట్రాక్టర్లు, లారీల్లో రవాణా చేసే సమయంలో విద్యుత్‌ వైర్లకు తగలకుండా చూడాలి.

● రహదారి, కాలువగట్టు, నివాసాల పక్కన చెత్త వేయడం మంచిదికాదు. చెత్తకు నిప్పంటించడం ప్రమాదకరం. అది చుట్టుపక్కల వ్యాపించే అవకాశం ఉంటుంది.

● నాణ్యత కలిగిన విద్యుత్‌ వైర్లు, పరికరాలను మాత్రమే ఇళ్లు, దుకాణాల్లో వినియోగించుకోవాలి.

● ప్రమాదం సంభవించిన వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేసే ఆధునిక ఆపరేటింగ్‌ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి.

● కొద్దిరోజుల క్రితం మర్రిపాడు మండలంలోని నందవరంలో ఓ పొగాకు బ్యారెన్‌ దగ్ధమైంది. క్యూరింగ్‌ కోసం ఏర్పాటు చేసిన పొగాకు కర్రలు జారిపడిపోవడంతో సాయంత్రం 5.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినా రాత్రి 7.30 గంటలకు కూడా ఫైరింజిన్‌ ఘటనా స్థలానికి రాలేదు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇక్కడి అగ్నిమాపక శకటాన్ని నెల్లూరుకు తరలించినట్లు చెబుతున్నారు. సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది.

నెల్లూరు(క్రైమ్‌): ఎండలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వేసవి పూర్తిగా రాకముందే భానుడు తన ప్రకోపాన్ని మెల్లమెల్లగా పెంచుతున్నాడు. అజాగ్రత్త, ఏమరపాటో, ఆకతాయిల చేష్టలు ఇలా కారణం ఏదైతేనేం ఏదో ఒకచోట నిప్పు రాజుకుంటూనే ఉంటోంది. ఆ సమయంలో ప్రతిక్షణం అమూల్యమైనదే. ఆలస్యమయ్యే కొద్దీ నష్టం పెరుగుతుంది. జిల్లాలో అవసరం మేరకు అగ్నిమాపక కేంద్రాల్లేక ప్రమాదాల నివారణ సవాలుగా మారుతోంది. కేంద్రాలున్న చోట కూడా సిబ్బంది కొరత వేఽధిస్తోంది. కొన్ని ప్రాంతాలు కేంద్రాలకు దూరంలో ఉండటంతో ఫైరింజిన్లు చేరుకునేలోగా బూడిద మిగులుతోంది.

తరచూ మరమ్మతులకు..

భానుడి భగభగలకు మానవ తప్పిదాలు తోడైతే పెను నష్టం వాటిల్లుతుంది. వేసవిలో అగ్నిప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా లేకపోతే ప్రజల ఆస్తులు, ప్రాణాలు బుగ్గిపాలు కావాల్సిందే. జిల్లాలో నెల్లూరు, కందుకూరు, కావలి, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, ఆత్మకూరు, రాపూరు, పొదలకూరుల్లో అగ్నిమాపక కేంద్రాలున్నాయి. స్టాండింగ్‌ ఫైర్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ ప్రమాణాల మేరకు ప్రతి 50 వేల జనాభాకు ఒక ఫైరింజిన్‌ ఉండాలి. ప్రస్తుతం 11 మాత్రమే ఉండగా అందులో ఒకటి మరమ్మతులకు గురైంది. మినీ ఫైరింజిన్‌ మూలనపడింది. కొన్ని వాహనాలకు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ లేకపోవడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో అగ్నిప్రమాదాలను సకాలంలో అరికట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా పెరుగుదల, విస్తరిస్తున్న ప్రాంతాలతో ప్రమాద సమయంలో అగ్నిమాపక వాహనాలు సకాలంలో అక్కడకు చేరుకోలేక పోతుండటంతో ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది.

తీవ్ర ఇబ్బందులు

జిల్లాలో అపార్ట్‌మెంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటిల్లో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవే. అపార్ట్‌మెంట్లలో సెట్‌బ్యాక్‌ లేకపోవడంతో ప్రమాదం జరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫైరింజిన్లు సులువుగా వెళ్లి మంటలను అదుపు చేసే పరిస్థితి ఉండాలి. అయితే అది చాలాచోట్ల లేదు. అలాగే గోదాముల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు, ఆస్పత్రులను బహుళ అంతస్తుల భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటిలో అధికశాతం ప్రమాద నివారణకు అవసరమైన పరికరాలు ఉంచడం లేదు. దీంతో ఆస్తితోపాటు ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది.

సర్వం కాలిపోయి..

నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో నెల్లూరు అగ్నిమాపక కేంద్రం నుంచి అగ్నిమాపక శకటాలు వెళ్లి మంటలను ఆర్పుతున్నాయి. ముత్తుకూరు, వెంకటాచలం, ఇందుకూరుపేట, రాజుపాళెం, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే 30 నిమిషాల నుంచి గంటపైగా సమయం పడుతుంది. దీంతో అనుకోని ఘటన జరిగితే ఫైరింజిన్లు అక్కడికి చేరుకునేలోపే సర్వం బుగ్గిపాలవుతోంది. కొండాపురం, వరికుంటపాడు తదితర ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న ప్రాంతాలకు అనుగుణంగా మండలానికి ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు పంపారు. అత్యవసర ప్రాతిపదిక కింద నెల్లూరు రూరల్‌, బుచ్చిరెడ్డిపాళెంలో నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, ఆత్మకూరు, ఉదయగిరి కేంద్రాల రెన్నోవేషన్‌, కావలిలో డబుల్‌ యూనిట్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. అవి కార్యరూపంలో ఉండగానే ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ఆ ప్రక్రియ మందగించింది.

ఖాళీలిలా..

అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. జిల్లా కేంద్రంలో ఏడీఎఫ్‌ఓ, ఆరుగురు లీడింగ్‌ ఫైర్‌మెన్లు, ఐదు డ్రైవర్‌/ఆపరేటర్‌, 18 మంది ఫైర్‌మెన్స్‌, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో అగ్నిమాపక కేంద్రానికి ఎస్‌ఎఫ్‌ఓ, ముగ్గురు లీడింగ్‌ ఫైర్‌మెన్‌లు, ముగ్గురు డ్రైవర్‌/ఆపరేటర్‌, తొమ్మిది మంది ఫైర్‌మన్లుండాలి. జిల్లాలో 158 మంది సిబ్బందికి గానూ 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎనిమిది మంది ఫైర్‌ ఆఫీసర్లకు గానూ ఐదుగురు మాత్రమే ఉన్నారు. మర్రిపాడు, ఉదయగిరి, ఆత్మకూరుల్లో ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 90 మంది ఫైర్‌మెన్లకు గానూ 58 మంది మాత్రమే ఉన్నారు. వారి స్థానంలో హోంగార్డులను వినియోగిస్తున్నారు. అయితే వారూ సరిపడనంతా లేకపోవడంతో ఉన్నవారిపైనే పనిభారం పడుతోంది.

అగ్నిమాపక శాఖను

వేధిస్తున్న సిబ్బంది కొరత

భారీ ప్రమాదాలు సంభవిస్తే

అంతే సంగతులు

అందుబాటులో 11 ఫైరింజిన్లు

తరచూ మరమ్మతులకు గురవుతున్న వైనం

ఆ శాఖలో కొన్ని పోస్టులు ఖాళీ

No comments yet. Be the first to comment!
Add a comment
తీసుకోవాల్సిన జాగ్రత్తలు1
1/4

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు2
2/4

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు3
3/4

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు4
4/4

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement