6 నుంచి మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు
నెల్లూరు(అర్బన్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 6వ తేదీ నుంచి మూడురోజులపాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహిస్తామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మన్నేపల్లి పెంచలరావు తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలోని ఎన్జీఓ భవన్‌లో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని మహిళా విభాగం చైర్‌పర్సన్ ఉదయగిరి చిన్నమ్మ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలరావు మాట్లాడుతూ పోటీలను ఏసీ స్టేడియంలో కలెక్టర్ ఆనంద్ ప్రారంభిస్తామన్నారు. మహిళా ఉద్యోగులు పాల్గొనేందుకు కలెక్టర్ రెండురోజులపాటు ప్రత్యేక అనుమతి ఇచ్చారన్నారు. 8న సెలవు మంజూరు చేశారన్నారు. ఈ మూడురోజులు ఉద్యోగులకు భోజనం, తాగునీరు ఇతర వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి, విద్యాసాగర్‌లు ముఖ్యఅతిథిలుగా విచ్చేస్తారన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ పోటీలలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్కాకుల పెంచలయ్య, ఇంకా ఆంజనేయవర్మ, ప్రసాద్‌రెడ్డి, కరుణమ్మ, కృష్ణంరాజు, సతీష్‌బాబు, రాజేంద్రప్రసాద్, విజయబాబు, కృష్ణకుమార్, సువర్ణ, స్వర్ణలత, నవోదయ, లక్ష్మి, జానకి, కిష్టమ్మ, సుమన తదితరులు పాల్గొన్నారు.
వర్చుసా లేఅవుట్
ప్రారంభం
మనుబోలు: మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్‌రోడ్డు సమీపంలో జాతీయ రహదారి పక్కన వర్చుసా లేఅవుట్‌ను ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చేతుల మీదుగా లేఅవుట్‌ను ప్రారంభించారు. సినీ హీరోయిన్లు నిధి అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, జబర్దస్త్ కమెడియన్లు సందడి చేశారు. ఈ సందర్భంగా లేఅవుట్ యజమాని వెంకటేశ్వర్లు, జీఎం శివాజీ మాట్లాడుతూ హైవే పక్కనే అందరికీ అందుబాటులో లేఅవుట్‌ను తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. బస్సు సౌకర్యం, 300 మీటర్ల దూరంలో రైలు సౌకర్యాలున్నాయని తెలిపారు. లేఅవుట్‌లో విశాలమైన రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
నేడు ప్రత్యేక
ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం
కలువాయి: మండలంలోని మాదన్నగారిపల్లి సచివాలయంలో సోమవారం జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆత్మకూరు ఆర్డీఓ అధ్యక్షతన ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం నిర్వహించనున్నట్టు తహసీల్దార్ శ్యామ్‌సుందర్‌రాజు ఆదివారం తెలిపారు. రైతులు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.
వృద్ధుడి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): అనారోగ్యమో మరే ఇతర కారణమో స్పష్టంగా తెలియదు గానీ ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. సంతపేటకు చెందిన సత్యనారాయణ (60), సుజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఒకరు అమెరికాలో ఉండగా, మరొకరు ఇక్కడే ఉంటున్నారు. సత్యనారాయణ గతంలో కుదువ వ్యాపారం చేసేవాడు. రెండేళ్లుగా మతిస్థిమితం సక్రమంగా లేక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు వచ్చి భార్యకు కనిపించేవాడు. శనివారం రాత్రి ఆయన సంతపేట సమీపంలో పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సుజాత ఫిర్యాదు మేరకు సంతపేట ఎస్సై బాలకృష్ణ కేసు నమోదు చేశారు.
కండలేరులో
51.647 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 51.647 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 760, లోలెవల్ కాలువకు 110, హైలెవల్ కాలువకు 160, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.61
సన్నవి : రూ.40
పండ్లు : రూ.30
పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్ (లైవ్) : 116
లేయర్ (లైవ్) : 80
బ్రాయిలర్ చికెన్ : 210
బ్రాయిలర్ స్కిన్‌లెస్ : 230
లేయర్ చికెన్ : 136
6 నుంచి మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు
6 నుంచి మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు
Comments
Please login to add a commentAdd a comment