ఎల్‌ఐసీలో పాలసీదారులకు నూరుశాతం భద్రత
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీలో పాలసీదారుల ప్రీమియంకు నూరుశాతం భద్రత ఉంటుందని ఎల్‌ఐసీ డివిజనల్ (నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు) సేల్స్ మేనేజర్ జి.ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరులోని మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న ఓ హోటల్లో ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల నుంచి సేకరించిన ప్రీమియంను ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైల్వేలు, రోడ్లు, భారీ పరిశ్రమల్లోనే పెట్టుబడిగా పెట్టే సంస్థ ఎల్‌ఐసీ అన్నారు. జీవన్ ఉత్సవ్, జీవన్ ఉమాంగ్, అమృత్‌బాల్, జీవన్ ఆనంద్ లాంటి పాలసీలకు పెద్దఎత్తున ప్రజల నుంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పాలసీల పట్ల ప్రజలకు ఏజెంట్లు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎండీఆర్‌టీ, ఇతర లక్ష్యాలను సాధించిన ఏజెంట్లను సన్మానించారు. కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాళెం బ్రాంచ్ మేనేజర్ పెంచలయ్య, డీఓ బాలసుబ్రహ్మణ్యం, పలువురు ఏజెంట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment