కన్నీటి సంద్రం
ఆమె జీవితం..
మంచానికే పరిమితమైన నాగమల్లేశ్వరి, పక్కనే చిన్నారి
ఆత్మకూరు: పట్టణంలోని వందూరుగుంట ప్రాంతంలో నివాసం ఉంటున్న నాగులు, తిరుపతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. అందరికీ వివాహాలై ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. నాగులు తోపుడు బండిపై పండ్లు అమ్ముతుంటాడు. అతని పెద్ద కుమార్తె నాగమల్లేశ్వరికి వివాహమైంది. రెండేళ్ల క్రితం.. భర్త, ఏడాది వయసున్న కూతురితో కర్నూలులో ఆనందంగా ఉంది. ఈ క్రమంలో నాగమల్లేశ్వరి ఇంటి వద్ద జారిపడగా తలకు గాయమైంది. భర్త ఆస్పత్రిలో చూపించాడు. వ్యాధిని వైద్యులు నిర్ధారించలేకపోయారు. దీంతో ఆమెను, కుమార్తెను ఆత్మకూరులోని తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చి చూసేవాడు. ఏడాదిన్నరగా అతను రావడంలేదని నాగులు, తిరుపతమ్మలు చెబుతున్నారు.
కుమార్తెను చూసి..
నాగమల్లేశ్వరి మంచానికే పరిమితమైంది. ఆమె ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. నోట మాట లేకపోగా కాళ్లు, చేతులు సైతం చచ్చుబడ్డాయి. మంచంపై ఉన్న తల్లిని చూసి కుమార్తె ద్వారక పలకరిస్తుంది. సమాధానం చెప్పలేని స్థితిలో నాగమల్లేశ్వరి కూతురిని చూస్తూ కన్నీరు పెడుతుంటుందని నాగులు చెబుతున్నాడు. ఈయన కూడా ఏడాది కాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. బండిని నెట్టుకుంటూ తిరిగి పండ్లు అమ్మలేని పరిస్థితి రావడంతో తిరుపతమ్మ కూలి పనులకు వెళ్తోంది. ఇంటికొచ్చాక నాగమల్లేశ్వరికి అన్ని సేవలు ఆమే చేస్తోంది. అసలు నాగమల్లేశ్వరికి వచ్చిన వ్యాధి ఏమిటో నిర్ధారించేందుకు చైన్నె లాంటి నగరాల్లోని ఆస్పత్రులకు వెళ్లాలని స్థానిక వైద్యులు తెలపడంతో ఇప్పటికే రూ.2 లక్షలకు ఖర్చు చేసి అప్పులపాలయ్యారు. మందుల కోసం ప్రతినెలా రూ.6 వేల నుంచి రూ.7 వేల ఖర్చు చేస్తున్నారు. నాగమల్లేశ్వరి ఆహారం తినలేకపోవడంతో ట్యూబ్ ద్వారా పాలు మాత్రమే అందిస్తున్నారు. మందులను పాలల్లో కలిపి ట్యూబ్ ద్వారా ఇస్తున్నట్లు నాగులు కన్నీరు పెట్టుకుంటూ తెలిపాడు. దాతలు సాయం చేస్తే కుమార్తెకు చికిత్స చేయించి బతికించుకుంటామని వేడుకుంటున్నాడు.
తెలియని వ్యాధితో జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైంది ఓ మహిళ. వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతున్న తరుణంలో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆమె తలకు గాయమైంది. ఆరోగ్య పరిస్థితి క్షీణించి శరీర అవయవాలు చచ్చుబడ్డాయి. భార్యపై కనికరం చూపకుండా భర్త వదిలేసి వెళ్లిపోయాడు.
రెండు సంవత్సరాలుగా
మంచానికే పరిమితం
పాలే ఆహారం
మందుల కోసం నెలకు రూ.వేలు ఖర్చు
దాతల సాయం కోసం ఎదురుచూపులు
దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 94918 28138
కన్నీటి సంద్రం
Comments
Please login to add a commentAdd a comment