దంపతుల ఆత్మహత్యాయత్నం
కావలి: కోర్టు వివాదంలో ఉన్న పొలంలో వరి పంట కోత పనులను అడ్డుకుంటుండటంతో కౌలు రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కావలి రూరల్ మండలం తాళ్లపాళెం గ్రామంలో మంగళవారం జరిగింది. కోత పనుల కోసం కౌలు రైతు ప్రసాద్‌రెడ్డి వరికోత మెషీన్‌ను తీసుకెళ్లగా కొందరు అడ్డుకున్నారు. దీంతో అతను, భార్య లక్ష్మీకాంతమ్మ పొలంలోనే పురుగు మందు తాగగా స్థానికులు వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ ప్రాణహాని లేదని తెలిసింది. సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
అడవుల్లో ట్రాప్
కెమెరాల ఏర్పాటు
సీతారామపురం: మండలంలోని సీతారామపురం, పండ్రంగి, దేవమ్మచెరువు, చిన్నాగంపల్లి బీట్‌ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో 35 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఆర్వో కేవీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల వెలుగొండ అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నందున దానిని గుర్తించేందుకు అడవిలో కెమెరాలు అమర్చామన్నారు. పశువుల కాపరులు అడవిలో సంచరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే అడవికి నిప్పు పెడితే శిక్షార్హులవుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment