సేదతీరుతూ..
నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం
నెల్లూరు(క్రైమ్): నర్సింగ్ విద్యార్థిని అదృశ్యమైన ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. వెంకటాచలం మండలానికి చెందిన సింధు నెల్లూరు నగరంలోని రిచ్ నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూ ఆమె ఇంటి నుంచి కళాశాలకు వచ్చి వెళ్లేది. ఈనెల ఒకటో తేదీన కళాశాలకు వచ్చింది. అక్కడి నుంచి అదృశ్యమైంది. బాధిత కుటుంబ సభ్యులు గాలించినా జాడ తెలియకపోవడంతో సోమవారం రాత్రి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment