ఇంటర్ పరీక్షలకు 885 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 885 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ జనరల్‌కు సంబంధించి 27,613 మంది విద్యార్థులకు 26,892 మంది హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 1,394 మందికి 1,230 మంది హాజరయ్యారు. 164 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ 6, డీవీఈఓ 4, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు 28 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఢిల్లీ వర్క్‌షాపులో
ఆత్మకూరు జెడ్పీటీసీ
నెల్లూరు (పొగతోట): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రజా ప్రతినిధులకు ఢిల్లీలో రెండు రోజుల పాటు వర్కు షాపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి ఆత్మకూరు జెడ్పీటీసీ పి.ప్రసన్నకు అరుదైన అవకాశం లభించింది. జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ఆత్మకూరు జెడ్పీటీసీని ప్రతిపాదించి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలో జెడ్పీటీసీ మహిళా సాధికారత, మహిళా భాగస్వామ్యం, మహిళల సాకారం, మహిళలు తదితర అంశాలపై అవగాహన కల్పించి, చర్చించారు.
‘రిలయన్స్’ భూముల్లో
జంగిల్ క్లియరెన్స్
ముత్తుకూరు: కృష్ణపట్నంలో రిలయన్స్ విద్యుత్ ప్రాజెక్ట్ (కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్) కోసం సేకరించిన భూముల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం గతంలో సుమారు 2,600 ఎకరాలు సేకరించారు. అనంతరం కొద్ది కాలానికే పనులు నిలిచిపోవడంతో 15 ఏళ్ల నుంచి ఈ భూముల్లో ఏపుగా చెట్లు పెరిగాయి. ఇటీవల ఈ ప్రాజెక్ట్ యజమాని అనిల్ అంబానీ కృష్ణపట్నం వచ్చి భూములు పరిశీలించి వెళ్లారు. జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాలకు అప్పగించారు. యంత్రాల ద్వారా ముళ్ల చెట్లు, పొదలను తొలగించి, భూములను చదును చేసే పనులను కాంట్రాక్ట్ పద్ధతిపై నిర్వహిస్తున్నారు.
కూటమి పాలనలో
వ్యవసాయ సంక్షోభం ●
● సీపీఎం రాష్ట్ర
కార్యదర్శి వి.శ్రీనివాసరావు
నెల్లూరు (వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉండడానికి కూటమి ప్రభుత్వమే కారణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది పుట్టి ధాన్యం రూ.22 వేలు ఉండగా, ఈ ఏడాది రూ.17 వేలకు పడిపోయిందని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నా.. ప్రభుత్వం మాత్రం దిష్టిబొమ్మలా చూస్తోందన్నారు. ఆప్కాస్ ద్వారా కార్మికులు వేతనాలు తీసుకుంటుంటే దానిని రద్దు చేసి టీడీపీ నాయకులకు కాంట్రాక్ట్ ఇచ్చి 4 శాతం కమీషన్ కొట్టేసేందుకు సిద్ధపడిందని ఆరోపించారు. అదానీ, మోదీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని టీడీపీ తాకట్టు పెడుతోందన్నారు. మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలు సాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏవీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు 885 మంది గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment