
● ఈ ఏడాది ఆర్థికంగా కుదేలు
శనగను సాగు చేసిన రైతుల పరిస్థితి దీనంగా మారుతోంది. ఖర్చులు, పెట్టుబడి గణనీయంగా పెరిగినా, దిగుబడులు అంతంతమాత్రమే వస్తుండటం వీరిని కలవరపాటుకు గురిచేస్తోంది. మద్దతు ధర లభించకపోవడం ఓ ఎత్తయితే.. కొనుగోలు కేంద్రాలను నేటికీ ప్రారంభించకపోవడంతో అన్నదాతల ఆందోళన వర్ణనాతీతమవుతోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పొలాల్లో విక్రయానికి సిద్ధంగా..
● పెరిగిన ఖర్చులు.. తగ్గిన దిగుబడులు
● నానాటికీ పతనమవుతున్న ధరలు
● నేటికీ ప్రారంభం కాని కేంద్రాలు
గఉదయగిరి: జిల్లాలో శనగను సాగు చేసిన రైతులను ఈ ఏడాది నష్టాలు వెంటాడుతున్నాయి. పెరిగిన పెట్టుబడులు.. కూలీ ఖర్చులు.. తగ్గిన దిగుబడులు.. గిట్టుబాటు లేని ధరలతో ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆపదలో ఉన్న అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏ మాత్రం కనికరించడంలేదు. ఫలితంగా అప్పులతో ఆర్థికంగా కుదేలవుతున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో శనగ విస్తీర్ణం సాధారణంగా 11,833 హెక్టార్లు కాగా, ఈ రబీ సీజన్లో 3436 హెక్టార్లలోనే సాగు చేశారు. వాస్తవానికి జిల్లాలో శనగను నవంబర్‌లో వేస్తారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కాస్త ఆలస్యంగా ప్రారంభించారు. చీడపీడల ఉధృతి అధికంగా ఉండటంతో సాగు ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఆ మేరకు దిగుబడులు రాకపోగా, మరింత తగ్గడం వీరిని ఆవేదనకు గురిచేస్తోంది.
తగ్గుతున్న ఆసక్తి
జిల్లాలోని మెట్ట మండలాలైన పొదలకూరు, చేజర్ల, అనంతసాగరం, అనుమసముద్రంపేట, కలిగిరి, వింజమూరు, కొండాపురం, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో ఎక్కువ మంది రైతులు శనగను సాగు చేసేవారు. అయితే ఇందులో లాభాలు రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు.
నిరాశాజనకంగా ధరలు
శనగ రైతులకు ఖర్చులు, పెట్టుబడులు ఏటా పెరుగుతున్నా, ఆ మేరకు ధరలు మాత్రం లభించడంలేదు. ఒక ఎకరాలో సాగు చేసేందుకు కనీసం రూ.20 వేల నుంచి రూ.25 వేలు వెచ్చించాల్సి వస్తోంది. అయితే ధర ప్రస్తుతం క్వింటా రూ.ఐదు వేలే పలుకుతోంది. దిగుబడి మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల మేరే వస్తోంది. ఇలా చూస్తే ఎకరాకు కనీసం రూ.ఐదు వేల వరకు నష్టం తప్పడంలేదు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర రూ.5,650గానే ఉంది. కొనుగోలు కేంద్రాలను నేటికీ ఏర్పాటు చేయలేదు. పైగా ఇందులో సవాలక్ష నిబంధనలతో కోత పెడుతున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. దీంతో వచ్చిన ధరలకే దళారులకు రైతులు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వ్యవసాయ సాగు చేసింది సాధారణంగా
సబ్ డివిజన్ సాగయ్యేది (హెక్టార్లలో)
ఆత్మకూరు 1178 3076
కావలి 1314 2854
నెల్లూరు 39 68
కందుకూరు 905 5835
సాగులో ఎంతో వ్యత్యాసం
నష్టాలు తప్పడంలేదు
మూడెకరాల్లో శనగ సాగు చేశా. పెట్టుబడిగా ఎకరానికి రూ.25 వేల చొప్పున రూ.75 వేలైంది. దిగుబడి పది క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుత ధర మేరకు రూ.50 వేలే లభించేలా ఉంది. దీని బట్టి నష్టం తప్పేలా లేదు. మద్దతు ధరను పెంచి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.
– సురేష్, రైతు,
పార్లపల్లి, కొండాపురం మండలం
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం
జిల్లాలో సాగు చేసిన శనగ నూర్పిళ్లను ప్రస్తుతం చేస్తున్నారు. వీటిని మార్క్‌ఫెడ్, రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే విషయమై ఉన్నతాధికారులకు నివేదించాం. వీరి నుంచి ఆదేశాలు రాగానే కొనుగోలు చేస్తాం.
– సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారి

● ఈ ఏడాది ఆర్థికంగా కుదేలు

● ఈ ఏడాది ఆర్థికంగా కుదేలు

● ఈ ఏడాది ఆర్థికంగా కుదేలు

● ఈ ఏడాది ఆర్థికంగా కుదేలు

● ఈ ఏడాది ఆర్థికంగా కుదేలు
Comments
Please login to add a commentAdd a comment