
జాతీయ లోక్‌అదాలత్ రేపు
నెల్లూరు (లీగల్): ఈ నెల ఎనిమిదిన నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని పేర్కొన్నారు. జిల్లా కోర్టులోని తన చాంబర్‌లో విలేకరులతో గురు వారం ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నామని, నెల్లూరు, కోవూరు, కావలి, గూడూ రు, వెంకటగిరి, ఆత్మకూరు, కోట, ఉదయగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట కోర్టుల్లోని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని కేసులను రాజీ చేసుకోవాలని కోరారు. ఐదో అదనపు జిల్లా జడ్జి సర స్వతి, పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి సుమ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కరుణకుమార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment