
రైస్‌మిల్లు యజమానిపై కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్): ధాన్యం తాలూకా నగదు ఇవ్వకుండా రైతును మోసగించిన రైస్‌మిల్లు యజమానిపై నెల్లూరు నవాబుపేట పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. ఆత్మకూరు పట్టణం పంటవీధికి చెందిన పి.పవన్‌కుమార్‌రెడ్డి నెల్లూరు నగరంలోని యనమలపాళెంలో ఉన్న శ్రీసాయిబాబా రా అండ్ బాయిల్డ్ రైస్‌మిల్లు యజమాని శేఖర్‌బాబుకు రూ.8.31 లక్షల విలువైన ధాన్యం తోలాడు. శేఖర్‌బాబు దీనికి సంబంధించిన నగదు ఇవ్వకుండా మోసం చేసి పరారయ్యాడు. బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ అన్వర్‌బాషా తెలిపారు.
జెడ్పీ సర్వసభ్య
సమావేశం నేడు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన శనివారం నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. దీనికి రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పి.నారాయణ, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. గ్రామీణ నీటి సరఫరా, అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సీఈఓ విద్యారమ శుక్రవారం కోరారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.70
సన్నవి : రూ.50
పండ్లు : రూ.35
పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్ (లైవ్) : 92
లేయర్ (లైవ్) : 90
బ్రాయిలర్ చికెన్ : 170
బ్రాయిలర్ స్కిన్‌లెస్ : 190
లేయర్ చికెన్ : 153

రైస్‌మిల్లు యజమానిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment