
బెల్లం సరఫరా చేయొద్దు
● వ్యాపారులకు ఏసీ, డీపీఈఓల హెచ్చరిక
నెల్లూరు(క్రైమ్): నాటుసారా తయారీదారులకు బెల్లం సరఫరా చేయొద్దని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.దయాసాగర్‌రావు, డీపీఈఓ ఎ.శ్రీనివాసనాయుడు బెల్లం వ్యాపారులను హెచ్చరించారు. శుక్రవారం నెల్లూరు బీవీ నగర్‌లోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో బెల్లం హోల్‌సేల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ పది కేజీల మించి బెల్లం విక్రయిస్తే కొనుగోలుదారుని ఆధార్, ఫోన్ నంబర్‌ను సేకరించి ఆ వివరాలను ఎకై ్సజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. బెల్లం కొనుగోలుకు వచ్చేవారు అనుమానాస్పదంగా ఉంటే తమకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎకై ్సజ్ నెల్లూరు – 1 ఇన్‌స్పెక్టర్ పి.రమే
ష్‌బాబు, ఎస్సై ఎస్.ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment