
జనని.. జగజ్జేత
ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకుని ఆమె జగజ్జేతగా ఎదుగుతోంది. అమ్మగా, అక్కగా, చెల్లిగా, ఆలిగా కుటుంబ బాధ్యతల్లో మునిగి తేలుతున్న ఆమె ఉద్యోగినిగా, ప్రజాప్రతినిధిగా దక్షత చూపుతోంది. మదుపరులుగా సామాన్య మహిళలు కుటుంబసభ్యుల సహకారం, ప్రోత్సాహంతో చిరు వ్యాపారాల్లో, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలుగా ఆర్థిక సాధికారత వైపు అడుగులు వేస్తున్నారు. అసామాన్య ప్రతిభతో అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దిన చేతులతో నవసమాజాన్ని తీర్చిదిద్దుతున్నారు. జగతికి వెలుగులు పంచుతున్న అమృతమూర్తులు జగజ్జేతలు.
ట్రాక్టర్ నడుపుతున్న సర్పంచ్ వెంకటసుబ్బమ్మ
కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకం అందుకున్న విలాసిని (ఫైల్)
మొక్కుబడిగా పనులు.. రూ.లక్షల్లో నిధుల స్వాహా
● మౌనం పాటిస్తున్న ఉన్నతాధికారులు
● వరికుంటపాడు ఫారెస్టు బీట్‌లో
అంతులేని అవినీతి
ఉదయగిరి: అటవీ శాఖ వరికుంటపాడు బీట్ పరిధిలో కొత్తపేటలో క్యాంపా పథకం పేరుతో అటవీశాఖలో దోపిడీ పర్వానికి తెరతీశారు. గతేడాది ఈ ఏరియాలో సుమారు 116 హెక్టార్లలో తెల్లమద్ది, వేప, మర్రి, రాగి, నేరేడు, ఎర్రచందనం మొక్కలు నాటారు. ఇక్కడ నుంచే అవినీతికి శ్రీకారం చుట్టారు. ఈ మొత్తం భూమి కొనుగోలు చేసి అటవీ శాఖకు ఇచ్చారు. అప్పటికే ఈ భూమిలో జామాయిల్ మోడు ఉంది. ఈ ల్యాండ్ అభివృద్ధి పేరుతో అధికారులు సుమారు రూ.20 లక్షలు నిధులు స్వాహా చేశారనే అరోపణలు ఉన్నాయి. ఈ మోటు కర్ర మొత్తం రూ.20 లక్షలకు అమ్ముకున్నారు. అంటే అభివృద్ధి పేరుతో నిధులు కాజేయడంతో పాటు ఉన్న మోడు అమ్మకం ద్వారా పెద్ద మొత్తంలో జేబుల్లో వేసుకున్నారు. వరికుంటపాడు, దుత్తలూరు మండలాల సరిహద్దు ప్రాంతం కొత్తపేట ఏరియాలో 116 హెక్టార్ల ప్రభుత్వ భూమిలో ప్రత్యామ్నాయ వనీకరణ పథకానికి సుమారు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉదయగిరి అటవీ అధికారులు ప్రారంభించారు. ఈ పనులు కనియంపాడు వన సంరక్షణ సమితి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరగాలి. కానీ వారిని డమ్మీ చేసి పనులు మొత్తం ఉదయగిరి ప్రాంతం నుంచి కూలీలను తీసుకొచ్చి పనులు చేయించారు. రికార్డుల్లో మాత్రం కనియంపాడు వీఎస్‌ఎస్ సభ్యులు పేర్లు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. దీంతో ఆయన స్థానిక నేతలకు వీఎస్‌ఎస్ సభ్యులకు, అటవీ అధికారులకు రాజీ కుదిర్చి కొంత మొత్తం పంచుకున్నట్లు సమాచారం.
పనుల్లో మాయ.. దోపిడీ అధికమాయె
మొక్క నాటే సమయంలో నిబంధనలు పాటించలేదు. ఈ భూమి మొత్తం ఇసుక తెర తేలిక నేల అయినప్పటికీ కొంత మేర గట్టి నేలగా చూపించి అధిక రేట్లతో ఎంబుక్ రికార్డు చేసి నిధులు కాజేశారు. మొక్క నాటేందుకు 30 సెం.మీ. లోతు, వెడల్పుతో గుంతలు తీయాల్సి ఉన్నా.. ౖపైపెనే గుంతలు తీసి నాటారు. దీంతో మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉండదు. ఎండబెట్టకు మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చాలా మొక్కలు ఎండిపోయి ఉన్నాయి. మొక్కలు నాటేటప్పడు రసాయనిక ఎరువులు (డీఏపీ, యూరియా, ఫాస్పరస్) గుంతల్లో వేసి మట్టి కప్పివేయాలి. కానీ ఎరువులు వేయ లేదు. అన్నీ వేసినట్లుగా ఎంబుక్‌ల్లో నమోదు చేసుకుని పెద్ద మొత్తంలో నిధులు స్వాహా చేశారు.
అంతర సేద్యంలో అదే తంతు
ఈ ఏడాది మొక్కల్లో అంతర సేద్యం మమ అనిపించారు. అరకొరగా చేసి.. మొత్తం భూమిలో సేద్యం చేసినట్లు నిధులు డ్రా చేశారు. మొక్కలు దగ్గర 30 సెం.మీ. మేర కూలీలతో అంతర కృషి చేయాలి. కానీ అది కూడా తూతూ మంత్రంగా చేసి నిధులు కాజేశారు. ఈ భూమిలో 3 బీట్‌లు ఉండగా ఒక్కొక్క బీట్‌కు ముగ్గురు చొప్పున కాపలాదార్లను పెట్టినట్లు రికార్డు చేసి నెలకు ఒక్కొక్కరి పేరుతో రూ.13 వేలు డ్రా చేస్తున్నారు. కానీ అక్కడ మొత్తం ముగ్గురు మాత్రమే కాపలా ఉన్నారు. వారికి నెలకు రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారు. రెండో ఏడాది మొక్కలకు ఎరువులు కూడా వేయకుండానే వేసినట్లు రికార్డు చేసి నిధులు కాజేశారు. అనేక విధాలుగా పెద్ద మొత్తంలో ప్రజాధనం అటవీ అధికారులు, సిబ్బంది దిగమింగేశారు. దిగువ స్థాయి నుంచి పైస్థాయి వరకు ఎవరి కమీషన్ వారు తీసుకొని గుమ్మనంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కమీషన్లతో ముఖం చాటవేత
ఈ అవినీతి మొత్తం బయటకు రావాలంటే విజిలెన్స్, సీఐడీ సమగ్రంగా దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అందులో జరిగిన అవినీతి బయట పడుతుంది. ఈ అవినీతి వ్యవహారంలో కొంత మంది అధికారులు పాత్ర ఉండడం, పైగా ఈ పనులకు సంబంధించి ఎఫ్‌బీఓ నుంచి జిల్లా స్థాయి అధికారులకు వరకు కమీషన్లు ఇస్తుండడంతో పత్రికల్లో, మీడియాలో కథనాలు వస్తున్నా.. స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
పది పూర్తి కాగానే వివాహం
– జెడ్పీ సీఈఓ విద్యారమ
నెల్లూరు (పొగతోట): విద్యారమ చిత్తూరులో పెరిగారు. పదో తరగతి పూర్తికాగానే వివాహం అయింది. అనంతరం భర్త ప్రోత్సాహంతో ఎస్‌వీ యూనివర్సిటీలో పీజీ వరకు చదివారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓగా చిత్తూరులో దీర్ఘకాలం పని చేశారు. అనంతరం పదోన్నతిపై శ్రీకాళహస్తి డీఎల్‌పీఓగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ సీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగారు.
లక్ష్యాల వైపు అడుగులు వేసి..
– గంగాభవాని, డ్వామా పీడీ
నెల్లూరు (పొగతోట): మహిళలు స్వయంసమృద్ధి సాధించాలంటే లక్ష్యాల వైపు అడుగులు వేయాల్సి ఉంది. కోనసీమ జిల్లాకు చెందిన గంగాభవానీ విద్యాభ్యాసం స్థాయి నుంచే తన లక్ష్యం వైపు అడుగులు వేశారు. అక్కడే విద్యను పూర్తిచేశారు. 2000 సంవత్సరంలో ఈఓపీఆర్‌డీగా ఉద్యోగంలో చేరిన ఆమె అనంతరం అంచెలంచెలుగా ఎంపీడీఓగా, డీఎల్‌పీఓగా చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా డ్వామా పీడీగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. అన్ని రంగాల్లో ముందుండాలంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం కల్పించాలి. సమాజంలో మహిళను బలపరిస్తే ఆమె కుటుంబాన్ని బలపరుస్తుంది. కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుంది. అప్పుడే సమాజం ఆనందంగా ముందుకు సాగుతుందని ఆమె అంటారు.
ఆమెది బహుముఖ పాత్ర
పొదలకూరు: ఇంటినే కాదు.. ఊరిని పరిశుభ్రంగా ఉంచడంలో ఆమెకు ఆమె సాటి. ఇంట్లో పాడి గేదెల పోషణ, సేద్యం పనుల నుంచి పంచాయతీ పాలన వరకు ఆమె ఒంటి చేత్తో చేస్తోంది. పురుషులతో మహిళలు ఏమాత్రం తీసిపోరని మండలంలోని పులికల్లు సర్పంచ్ గొడ్డేటి వెంకటసుబ్బమ్మ నిరూపిస్తోంది. సర్పంచ్‌కు వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. ఆమె స్వయంగా ట్రాక్టర్ నడుపుతోంది. పొలం దుక్కి దున్నకం పనులు, తన నిమ్మతోటలో చెట్లకు స్ప్రేయర్‌తో పిచికారీ చేయడంతోపాటు అన్ని రకాల వ్యవసాయ పనులను చేయడంతోపాటు, పాడి గేదెల ఆలనా పాలనా చూసుకుంటారు. పొదుపు సంఘంలో సభ్యురాలిగా కొనసాగుతూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. పంచాయతీ పాలన విషయానికి వస్తే గ్రీన్ అంబాసిడర్లను నియమించి చెత్త నుంచి సంపద కేంద్రానికి ప్రతినిత్యం ఊర్లో చెత్తను సేకరించి తరలిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు.
లక్ష్యానికి వివాహం ఆటంకం కాదు
– హిందీ పండిత్ నాగేశ్వరి
నెల్లూరు సిటీ: పెళ్లి తర్వాత జీవితం ఇంతటితో అయిపోయిందని చాలా మంది మహిళలు నిరుత్సాహానికి గురవుతారు. నా జీవిత ప్రయాణం వివాహం తర్వాతనే సార్థకమైంది. నెల్లూరు నగరంలోని మూడో మైలుకు చెందిన నాగేశ్వరికి ఇంటర్ పూర్తి కాగానే 1993లో పెద్దలు వివాహం చేశారు. ఈ క్రమంలో భర్త శ్రీహరిబాబు ప్రోత్సాహంతో వివాహమైన 8 ఏళ్లకు డిగ్రీ పూర్తి చేసింది. హెచ్‌పీటీ, ఎంఏ హిందీ, ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసింది. 2008లో హిందీ పండిట్ గా ఉద్యోగం సాధించింది. మూడేళ్లలోనే ఎస్‌ఏగా పదోన్నతి పొందారు.
ఆత్మస్థైర్యంతో ముందుకు
– సబ్‌కలెక్టర్ తిరుమాణి శ్రీపూజ
కందుకూరు: ఎంచుకున్న రంగంలో రాణించేందుకు మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ప్రస్తుత సమా జ తీరును బట్టి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు. ఇంట్లో ఉండే మహిళలైనా సరే ఏదో ఒక రంగంలో రాణించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తే విజయం సాధించడం చాలా సులభం. స్వయం ఉపాధిని పొందేందుకు చేతి వృత్తులు వంటివి నేర్చుకుని కుటుంబానికి అండగా నిలబడవచ్చు. మహిళల్లో కూడా తాము సాధించగలం అనే నమ్మకం పెరుగుతుంది. పెళ్లికాగానే అంతా అయిపో యిందనే భావన నుంచి మహిళలు బయటకు వచ్చి స్వతంత్రంగా రాణించేందుకు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా చదువుకునే విషయం దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ ఆడపిల్లలను మగ పిల్లలతో సమా నంగా చూడాల్సిన అవసరం ఉంది.
మొక్కల మాటున మేత
ఉదయగిరి ఫారెస్టు రేంజ్ పరిధిలోని కృష్ణంపల్లి సెక్షన్ వరికుంటపాడు బీట్ పరిధిలో కొత్తపేటలో జరుగుతున్న అటవీ ప్రత్యామ్నాయ వనీకరణ (సీఏ) పథకం పనుల్లో అంతులేని అవినీతి చోటు చేసుకుంటోంది. భూమికి భూమి పరిహారంగా కొనుగోలు చేసిన ప్రక్రియ నుంచి భూమి అభివృద్ధి, మోడు కర్ర తొలగించడం, గుంత తీయడం, మొక్కలు నాటడం, ఎరువులు వేయడం వరకు అడుగడుగునా నిధులను క్షేత్రస్థాయిలో దోచుకున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో నాటిన మొక్కలు కూడా ఎండిపోతున్నాయి.

జనని.. జగజ్జేత

జనని.. జగజ్జేత

జనని.. జగజ్జేత

జనని.. జగజ్జేత

జనని.. జగజ్జేత

జనని.. జగజ్జేత

జనని.. జగజ్జేత

జనని.. జగజ్జేత

జనని.. జగజ్జేత
Comments
Please login to add a commentAdd a comment