
కుటుంబ విలువలను కాపాడదాం
నెల్లూరు (పొగతోట): నేటి సమాజంలో కుటుంబ విలువలను కోల్పోతున్నాం. కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చేలా అందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి నెల్లూరులో ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు. వివిధ మండలాల్లో ఎంపీడీఓగా పనిచేశారు. దివ్యాంగుల శాఖ ఏడీగా జిల్లాలో విధులు నిర్వహించారు. అనంతరం పదోన్నతి పొందారు. ప్రస్తుతం డీఆర్‌డీఏ పీడీగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. మహిళలు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తూ ఆరోగ్యం, కుటుంబ విషయాలపై ప్రత్యేక సమయం కేటాయించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో బిజీగా ఉన్నా పిల్లల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి.
– నాగరాజకుమారి, డీఆర్‌డీఏ పీడీ
Comments
Please login to add a commentAdd a comment