ఆత్మకూరు: చదువుతోనే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం. గతంలో చదువుకు మహిళలకు ఎన్నో ఆటంకాలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహిళలు ఆడ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. అందుకు పూర్తి మద్దతు ఇవ్వాలి. మాది వైఎస్సార్ జిల్లాలోని మైదుకూరు సమీపంలోని పల్లె. తండ్రి గంగయ్య రైతు. తల్లి లక్ష్మీ గృహిణి. చదువులో తనను బాగా ప్రోత్సహించారు. కడపలోని వాగ్ధేవి ఇంజినీరింగ్ కళాశాలలో మెరిట్ మార్కులతో ఉత్తీర్ణురాలైనప్పటికీ ఆసక్తి ఉన్న సివిల్స్‌కు సాధన చేసి మూడో సారి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించాను. తిరుపతిలో శిక్షణ అనంతరం తొలిసారి ఆర్డీఓగా ఆత్మకూరులో విధులు నిర్వహిస్తున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, చదువుపై ఆసక్తే ఈ స్థాయికి తెచ్చింది.
– భూమిరెడ్డి పావని, ఆర్డీఓ, ఆత్మకూరు
Comments
Please login to add a commentAdd a comment