
కంటైనర్‌ను ఢీకొనడంతో..
నెల్లూరు(క్రైమ్): జాతీయ రఽహదారిపై కంటైనర్‌కు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి బైక్ ఢీకొంది. ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న కుమారుడు మృతి చెందగా, తల్లి అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. ముత్తుకూరుకు చెందిన కొండమ్మ, తన కుమారుడు రవికుమార్ బైక్‌పై గూడూరు వైపు శనివారం బయల్దేరారు. సౌత్‌రాజుపాళెం జంక్షన్ వద్దకొచ్చేసరికి ముందు వెళుతన్న కంటైనర్‌కు డ్రైవర్ సడన్‌బ్రేక్ వేశారు. దీంతో బైక్ ఢీకొనడంతో తల్లీకుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108లో జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే రవికుమార్ మృతి చెందారు. కొండమ్మ అపస్మారక స్థితిలో ఉన్నారు. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి.. హాస్పిటల్‌కు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి సెల్‌ఫోన్‌ను అన్‌లాక్ చేసి అందులోని నంబర్లకు ఫోన్ చేసి కుటుంబసభ్యులకు సమాచారం అందించామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment