
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ముత్తుకూరు: అదానీ కృష్ణపట్నం పోర్టు ప్రభావిత గ్రామాల్లో పేద మహిళలు ఆర్థికంగా ఎదగాలని పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ కాంక్షించారు. కృష్ణపట్నంలో శనివారం నిర్వహించిన మహిళా దినోత్సవానికి తన సతీమణి చాందినీ పటేల్‌తో కలిసి హాజరైన ఆయన మాట్లాడారు. గ్రామీణ మహిళలు సంతోషంగా, గర్వంగా జీవనం సాగించాలని, దీనికి అదానీ ఫౌండేషన్ కృషి చేస్తోందని చెప్పారు. అనంతరం సుగంధద్రవ్యాల ప్రాసెసింగ్ – ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు రూ.ఐదు లక్షల చెక్కును మహిళా గ్రూప్ లీడర్‌కు అందజేశారు. జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం సరళ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment