
అన్నదాతలకు శాపం
ఇసుకకు తాపత్రయం..
● సంగం బ్యారేజీలో డ్రెడ్జింగ్‌కు నీరు నిల్వ
● బీరాపేరు నీటితో వందెకరాల్లో
మునిగిన వరి
● ఆందోళనలో అన్నదాతలు
సంగం: ఇసుకాసురుల తాపత్రయం అన్నదాతలకు శాపంగా పరిణమిస్తోంది. సంగం బ్యారేజీ దిగువ భాగంలో ఇసుక డ్రెడ్జింగ్ కోసం ఎగువ భాగంలో నీటిని అలానే నిల్వ ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఇది సమీపంలోని బీరాపేరులోకి చేరి చెంతనే ఉన్న పొలాలను ముంచెత్తుతోంది. ఈ పరిణామంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
రైతులకు నరకం
అన్నదాతలకు ప్రత్యక్ష నరకాన్ని కూటమి ప్రభుత్వం చూపుతోంది. సంగం సమీపంలోని బీరాపేరు వద్ద వందెకరాలకుపైగా సాగు భూములున్నాయి. ఇందులో రైతులు బీపీటీ రకం వరిని పండిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో వీరి పంటలు పాడైపోయేలా ఉన్నాయి. పెన్నాలో పడవతో ఇసుక డ్రెడ్జింగ్‌కు సంగంతో పాటు పొదలకూరు మండలంలోని సూరాయపాళేన్ని ఎంచుకోవడం ఇక్కడి రైతులకు ఇబ్బందిగా మారింది. ఇక్కడ పడవల ద్వారా ఇసుకను సేకరించాలంటే సంగం బ్యారేజీ వద్ద 13.2 అడుగుల మేర నీటిమట్టాన్ని ఉంచాలి. ఆ మేరకు నీటిమట్టాన్ని ఉంచడంతో బీరాపేరు వాగులోకి నీరు అధికంగా చేరి పక్కనే ఉన్న రైతుల పొలాల్లోకి చేరుతోంది. దీంతో ఇప్పటికే కోత దశకొచ్చిన వందెకరాలకు పైగా వరి పంట దెబ్బతింటోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్నదాతలకు శాపం
Comments
Please login to add a commentAdd a comment