
భగత్‌సింగ్‌కాలనీ జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన అక్కా, తమ్ముడు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన మల్లయ్య, నాగమణి దంపతులకు నిషిత (22), కార్తీక్ (20) సంతానం. సూర్యాపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ, కుమార్తెను బీటెక్ ఫైనలియర్, కుమారుడ్ని డిప్లొమా చదివిస్తున్నారు.
తన కుటుంబంతో కలిసి తిరుమలకు ఈ నెల ఆరున వెళ్లారు. దర్శనానంతరం తిరిగి తమ ఊరెళ్లేందుకు గానూ తిరుపతికి శుక్రవారం అర్ధరాత్రి చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌కు బయల్దేరగా, మార్గమధ్యలో ఇన్నోవా డ్రైవర్ తాను విజయవాడ వెళ్తున్నానని చెప్పారు. దీంతో వీరు అందులో బయల్దేరారు. భగత్‌సింగ్ కాలనీ జంక్షన్ వద్దకొచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొని, ఆపై చైన్నె వైపు వెళ్లే జాతీయరహదారిపై గుర్తుతెలియని లారీని ఢీకొన్నారు.
ఘటనలో నిషిత, కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందగా, తల్లిదండ్రులు, డ్రైవర్ శివరామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సాయంతో మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎస్సై బలరామిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment