
జెడ్పీ సమావేశం వాయిదా
నెల్లూరు (పొగతోట): కోరం లేని కారణంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. శనివారం సర్వసభ్య సమావేశ నిర్వహణకు జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ విద్యారమ షెడ్యూల్ ప్రకటించారు. అయితే శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో జెడ్పీ సభ్యులు, మంత్రులు హాజరు కాలేదు. కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ ప్రకటించారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో చైర్‌పర్సన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ విద్యారమ, డ్వామా పీడీ గంగాభవాని, వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి, బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మమ్మ, జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి పరిమళ, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలారెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ అధికారిణి శోభారాణి తదితర అధికారులు పాల్గొన్నారు.
నంబరు ప్లేట్లు,
బ్లాక్ ఫిల్మ్‌పై తనిఖీలు
నెల్లూరు (టౌన్): వాహనా లపై నంబర్ ప్లేట్లు, కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్‌లపై రవాణా శాఖాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. బైక్‌ల నుంచి కార్ల వరకు రవాణాశాఖ నిబంధనలు ధిక్కరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఈ నెల 6వ తేదీ సాక్షిలో ‘అడిగే దమ్ముందా?!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆ శాఖ అధికారులు స్పందించారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో బృందాలుగా ఏర్పడి నిబంధనలు అతిక్రమించిన పలు వాహనాలపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా నాలుగు చక్రాల వాహనాలకు సంబంధించి నంబరు ప్లేట్లు, బ్లాక్ ఫిల్మ్, ద్విచక్ర వాహనదారుల నంబరు ప్లేట్లుపై తనిఖీలు చేశారు. దాదాపు 100 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ. 2 లక్షల మేర అపరాధ రుసుం విధించారు. ఇన్‌చార్జి ఆర్టీఓ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ రవాణా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు ఎండీ రఫీ, కార్తీక్, బాబు, ఏఎంవీఐలు పూర్ణచందర్రావు, స్వప్నిల్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల
మధ్య ఫ్లెక్సీల రగడ
గుడ్లూరు: నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వర్గీయుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గుడ్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఎంపీ వర్గీయులు ఓ ఫ్లెక్సీని ఏర్పా టు చేశారు. అయితే ఎంపీ వర్గీయులు ఏర్పా టు చేసిన ఫ్లెక్సీని పక్క పడేసి, ఆ స్థానంలో ఎమ్మెల్యే వర్గీయులు మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆదివారం వీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ట్రై సైకిళ్ల పంపిణీ ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూసి ఎమ్మెల్యే వర్గీయులు జీర్ణించుకోలేక పడేయటం చర్చనీయాంశమైంది.

జెడ్పీ సమావేశం వాయిదా

జెడ్పీ సమావేశం వాయిదా
Comments
Please login to add a commentAdd a comment