
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
నెల్లూరు(బారకాసు): నెల్లూరు రూరల్ పరిధిలోని 35వ డివిజన్‌కు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి సమక్షంలో యాకసిరి రంజిత్ కిరణ్, 200 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చింతారెడ్డిపాళెంలోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి పార్టీ కండువాలను కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు. కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాసరావు, ఐరెడ్డి సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, మస్తాన్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, ఆదిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, మురళీయాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment