వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొలువులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొలువులు

Published Wed, Mar 12 2025 7:36 AM | Last Updated on Wed, Mar 12 2025 7:31 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొలువులు

ఈ దంపతుల పేర్లు గడ్డం శీను, సరసమ్మ. సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం పంటపాళెం గ్రామానికి చెందిన వారు. వీరి కుమార్తె గడ్డం సుమిత్ర ఓ కాలేజీలో రెండో సంవత్సరం ఇంజినీరింగ్‌ చదువుతోంది. కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కళాశాల యాజమాన్యం మాత్రం వెంటనే ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. నిరుపేదలైన తాము చెల్లించే పరిస్థితిలలేమని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

– పొదలకూరు

జిల్లాలో 5 లక్షల మందికిపైగా

నిరుద్యోగులు

ఏడాదిగా కొత్త పరిశ్రమల

ప్రతిపాదనలు లేవు

కూటమి ప్రభుత్వం రాకతో గతంలో మంజూరైన పరిశ్రమల పురోగతి లేదు

మెగా డీఎస్సీ పేరుతో దగా

ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి విడుదల కాని ఒక్క నోటిఫికేషన్‌

రెండు బడ్జెట్లలోనూ నిరుద్యోగ భృతి ఊసేలేదు

జిల్లాలో 50 వేల మందికి అందని ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన

నేడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ

ఆధ్వర్యంలో ‘యువత పోరు’

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోయాయి. చదువుకునేందుకు విద్యార్థులు, చదువు పూర్తి చేసుకున్నా ఉద్యోగాలు రాక నిరుద్యోగుల కుటుంబాలు రోజు రోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. మరో వైపు నిరుద్యోగులు వయస్సు మీద పడిపోతున్నా.. కొత్త ఉద్యోగాలకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల కాలేదు. ప్రతి జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామంటూ హామీలు గుప్పించిన ప్రభుత్వ పెద్దలు ఆ ఊసే లేకుండా చేశారు. ఉద్యోగం కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా.. ఈ పథకానికి పైసా కూడా కేటాయించలేదు. ఇంటర్‌ నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్‌ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు ఐదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు.

జిల్లాలో గత ప్రభుత్వ ఐదేళ్లలో భారీగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆయా పరిశ్రమల్లో జిల్లాకు చెందిన నిరుద్యోగుల్లో టెక్నికల్‌, లేబర్‌ విభాగాల్లో సుమారు 50 వేల మందికిపైగా కొలువులు సాధించారు. ఇక సాఫ్ట్‌వేర్‌ రంగంలో అయితే లక్షల మందికి కొలువులు సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త కొలువులు సాధించడం కష్టంగా మారింది. గత ప్రభుత్వం హయాంలో చివరిలో మంజూరైన చాలా పరిశ్రమలకు కూటమి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవడంతో గ్రౌండింగ్‌ ప్రక్రియలో కాలయాపన జరుగుతోంది. ఇక ఈ ప్రభుత్వంలో కొత్త పరిశ్రమల ప్రతిపాదన కూడా ఒక్కటీ లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల మాట అటు ఉంచితే.. ప్రైవ్రేట్‌రంగంలో కూడా ఉద్యోగాలు రావడం నిరుద్యోగులకు కలగా మిగిలిపోతోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల్లో గెలవడానికి అడ్డమైన హామీలన్నీ ఇచ్చిన చంద్రబాబు అండ్‌ కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక నాలుక మడతేస్తున్నారు. అధికారం చేపట్టి తొమ్మిది నెలలు దాటిపోయినా.. ఒక్క పోస్టు భర్తీకి కూడా నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఊసే లేకపోవడంతో ఉద్యోగార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులకు చదువులు భారంగా మారాయి. జిల్లాలో ప్రభుత్వ అంచనా ప్రకారం సుమారు 5 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. డిగ్రీ, ఇంటర్మీడియట్‌, పదో తరగతి అర్హతతో జిల్లాలో ఎంతో మంది ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ కొలువులు కోసం కష్టపడుతూనే.. మరో వైపు కనీసం ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా రూ.3,000 వంతున ఇస్తామని చంద్రబాబు చెబితే.. ప్రతి జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఉద్యోగాలు కల్పిస్తామంటూ లోకేశ్‌ హామీలు గుప్పించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ పేరుతో తొలి సంతకం చేసినా.. తొమ్మిది నెలలుగా నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌ వస్తే కనీసం జిల్లాలో 650 మందికి ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో వేలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలను కుదించడంతోపాటు అందులో ఉద్యోగుల సంఖ్యను సైతం కుదించారు.

నిరుద్యోగ భృతి.. భ్రాంతి

అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీలు గుప్పించిన కూటమి పాలకులు తొమ్మిది నెలలుగా ఆ ఉసే ఎత్తడం లేదు. కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశ పెట్టినా నిరుద్యోగుల భృతికి సంబంధించి రూపాయి నిధులు కేటాయించలేదు. దీన్ని బట్టి ఈ ఏడాదికి కూడా భృతి భ్రాంతియే అని స్పష్టమవుతోంది. డీఎస్సీ అభ్యర్థులతోపాటు పోలీస్‌ కానిస్టేబుల్స్‌ రిక్రూట్‌మెంట్‌ ఉంటుందని పోలీస్‌ ఉన్నతాధికారులు చెప్పడంతో ఆ కొలువులు కోసం యువత శిక్షణ తీసుకునేందుకు రూ.వేలల్లో ఫీజులు కట్టి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. కుటుంబానికి ఆర్థిక భారం ఉన్నప్పటికి ప్రభుత్వ కొలువులు కోసం అప్పులు చేసి కోచింగ్‌లకు కట్టే ఫీజులు కాకుండా, ప్రైవేట్‌ వసతిగృహాల్లో ఉండేందుకు నెలకు రూ.6 వేల వరకు ఖర్చులు పెట్టుకుంటున్నారు. ఇటువంటి వారికి కనీసం నిరుద్యోగ భృతి కొంత మేర ఉపయోగపడుతుంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌,

వసతి దీవెనకు పంగనామాలు

జిల్లాలో టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులకు ఎగ్జామ్స్‌ జరుగుతున్నాయి. ఇప్పటికే డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకునే విద్యార్థులు అనేక మంది ఉన్నారు. వీరిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెనకు అర్హులైన 40,299 మంది ఉన్నారు. గతేడాది జనవరి నెల నుంచి ఇప్పటి వరకు ఆయా పథకాలకు నిధులు మంజూరు చేయలేదు. గత ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఈ పథకాల ద్వారా తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఇప్పటికి నాలుగు త్రైమాసికాలు పూర్తికాగా, ఈ నెలతో మరో త్రైమాసికం కూడా పూర్తి కానుంది. మరో నెల రోజుల్లోనే ఈ విద్యా సంవత్సరం ముగియనుంది. కానీ కూటమి ప్రభుత్వం ఐదు త్రైమాీసికాలుగా బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులపై కళాశాలలు ఒత్తిడి పెంచడంతో విద్యార్థులు తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించుకుని పరీక్షలకు హాజరు అయ్యేలా చేసుకున్నారు.

జిల్లాలో కుటుంబాల సంఖ్య

7.2 లక్షలు (అంచనా)

ప్రభుత్వంలో అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా 6,150

శాశ్వత ఉద్యోగులు 6,323

వలంటీర్లు 12,793

ప్రైవేట్‌ రంగాల్లో 8,600

వివిధ పరిశ్రమల్లో 50 వేల

మందికిపైగా..

నిరుద్యోగ యువత

5 లక్షల మంది పైగా..

40,299 మంది

‘యువత పోరు’ నేడు

జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసం, దగాపై ‘యువత పోరు’ కార్యక్రమం బుధవారం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. నెల్లూరు నగరంలోని ఉదయం 10 గంటలకు వీఆర్సీ సెంటర్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ర్యాలీ వెళ్లి కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేయనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వంచనపై నిరసన గళాన్ని వినిపించనున్నారు. అదే విధంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొలువులు 
1
1/4

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొలువులు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొలువులు 
2
2/4

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొలువులు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొలువులు 
3
3/4

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొలువులు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొలువులు 
4
4/4

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొలువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement