అసంపూర్తి గృహాలకు అదనపు ఆర్థిక సాయం
నెల్లూరురూరల్: 2019–24 మధ్య కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకా వివిధ దశల్లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అందజేసే యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ ఆనంద్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గృహ నిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు, అత్యంత వెనుకబడిన గిరిజనులకు రూ.లక్ష అదనపు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. పీఎంఏవై 1.0 ఇల్లు మంజూరై నిర్మాణంలో ఉన్న గృహాలకు అదనంగా ఆర్థిక సహాయం అందించి ఆ ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించినట్లు చెప్పారు. పీఎంఏవై (అర్బన్) బీఎల్సీ–1.0, పీఎంఏవై (గ్రామీణ్)–1.0, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటికే గృహాలను మంజూరు చేసిన లబ్ధిదారులకు ఈ అదనపు ఆర్థిక సహాయం వర్తిస్తుందన్నారు. ఈ మేరకు లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అడ్మిన్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
జిల్లాలో 75,344 మందికి
రూ.1,199.85 కోట్ల మంజూరు
జిల్లాలో 75,344 మంది లబ్ధిదారులకు ప్రయో జనం చేకూరనుంది. ఆత్మకూరులో 8,467, కందుకూరు 6,159, కావలి 10,779, కోవూరు 8,696, నెల్లూరు సిటీ 6,690, నెల్లూరు రూరల్ 8,400, సర్వేపల్లి 19,267, ఉదయగిరి 6,886 ఇళ్లకు సంబంధించి రూ.119.85 కోట్లు మంజూరయినట్లు కలెక్టర్ తెలిపారు. పీఎంఏవై (అర్బన్) బీఎల్సీ–2.0, పీఎంఏవై (గ్రామీణ్) –2.0, పీఎం జన్మన్ తదితర పథకాల కింద యూనిట్ విలువ రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీ, బీసీలకు రూ.50వేలు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
జిల్లాలో 75,334 మంది
లబ్ధిదారులకు ప్రయోజనం
కలెక్టర్ ఆనంద్
Comments
Please login to add a commentAdd a comment