వందలాది మందికి ఉపాధి
రంజాన్ మాసంలో చాలామందికి ఇష్టమైన వంటకం హలీం. ముస్లింలే కాకుండా ఇతరులు చాలామంది దీని రుచిని ఆస్వాదించేందుకు ఇష్టపడుతుంటారు. ఇప్పటికే నెల్లూరు నగరంలో హలీం తయారీ కేంద్రాలు ప్రధాన రహదారుల వెంట ఏర్పాటయ్యాయి. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన హలీం ప్రస్తుతం ప్రధాన పట్టణాల్లోనూ లభ్యమవుతోంది.
ఇష్టంగా తింటున్నారు
నెల్లూరు ప్రజలకు కొన్ని ఏళ్లుగా హలీంను విక్రయిస్తున్నాం. అప్పట్లో చాలా తక్కువ మంది మాత్రమే తినేవారు. ముస్లింలు ఉపవాస దీక్ష అనంతరం పౌష్టికాహారంగా ఈ వంటకాన్ని స్వీకరించేవారు. ఇప్పుడు చాలామంది ఇష్టంగా తింటున్నారు.
– రబ్బానీ, రియాజ్ హోటల్, నెల్లూరు
నెల్లూరు సిటీ: రంజాన్ మాసం వచ్చిందంటే.. అందరికీ గుర్తుకొచ్చేది హలీం. ఇది పోషక విలువలతో కూడిన రుచికరమైన ప్రత్యేక మాంసాహార వంటకం. రంజాన్ నెల ఎప్పుడొస్తుందా అని వేచిచూసే హలీం అభిమానులు పట్టణాలు, నగరాల్లో ఉన్నారంటే దీని ప్రత్యేకత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పదుల సంఖ్యలో మటన్, చికెన్ హలీం బట్టీలున్నాయి.
30కి పైగా కేంద్రాలు
నెల్లూరు నగరంలో కొన్నేళ్ల క్రితం వీఆర్సీ సెంటర్‌లో మాత్రమే మూడు హలీం కేంద్రాలుండేవి. అప్పట్లో ఈ వంటకం హైదరాబాద్, చైన్నె, బెంగళూరు సిటీలకు మాత్రమే పరిమితం. నగరవాసులకు హలీం నుంచి రూచి చూపించేందుకు నాడు రియాజ్, రేష్మా, శ్రావణ్య హోటల్స్ నిర్వాహకులు ముందుకొచ్చారు. క్రమేణా నగరంలోని పలు హోటళ్ల నిర్వాహకులు రంజాన్ సమయంలో హలీం తయారు చేసే మాస్టర్లను సిటీల నుంచి పిలిపిస్తున్నారు. దీంతో నేడు 30కి పైగా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీఆర్సీ సెంటర్, వేదాయపాళెం, ట్రంకు రోడ్డు, పొదలకూరు రోడ్డు, అన్నమయ్య సర్కిల్, కిసాన్ నగర్ తదితర ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలున్నాయి.
ఆస్వాదిస్తూ..
రంజాన్ ఉపవాస దీక్షల అనంతరం పోషక విలువలతో కూడిన మటన్, చికెన్ హలీం తినేందుకు ముస్లింలు ఇష్టపడతారు. దీని తయారీలో మటన్, చికెన్, గోధుమలు, పప్పులు, నెయ్యి, ఎండు ఫలాలు, ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల మసాలా దినుసులు వినియోగిస్తారు. అదే విధంగా ఇతర వర్గాలు వాళ్లు కూడా హలీం రుచిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు.
రూ.3.5 కోట్లకు పైగా వ్యాపారం
ఏటా రంజాన్ మాసంలో నెల్లూరు నగరంలో రూ.3.5 కోట్లకు పైగా హలీం వ్యాపారం సాగుతుంది. నగరంలో తయారు చేసే బట్టీలు పది ఉన్నాయి. వాటి నుంచి 30కి పైగా విక్రయ కేంద్రాలకు సరఫరా చేస్తారు. ప్లేట్ చికెన్ హలీం రూ.80 నుంచి రూ.150 ఉండగా, మటన్ రూ.220 నుంచి రూ.260ల మధ్య ఉంది.
హలీంను సిద్ధం చేస్తూ..
హలీంను తినేందుకు జనం ఆసక్తి చూపుతుండటంతో విక్రయ కేంద్రాలు పదుల సంఖ్యలో వెలిశాయి. చిన్న హోటళ్ల నిర్వాహకులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మాస్టర్‌కు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు వరకు చెల్లించాల్సి ఉంది. అదే విధంగా సహాయకులు, విక్రయదారులు ఇలా అనేకమంది ఉపాధి పొందుతున్నారు.
రంజాన్ మాసంలో దొరికే ప్రత్యేక వంటకం
ఒకప్పుడు పెద్ద నగరాల్లో లభ్యం
నేడు నగరం, పట్టణాల్లో
అందుబాటులో..
నెల్లూరులో 30కి పైగా
హలీం కేంద్రాల ఏర్పాటు
రుచి చూసేందుకు జనం ఆసక్తి
ఏటా విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తా
రంజాన్ మాసం వచ్చిందంటే హలీం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ వంటకాన్ని చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు తింటున్నారు. ఆరోగ్యవంతమైన ఆహారం కావడంతో విక్రయ కేంద్రాలు విస్తృతంగా ఏర్పాటవుతున్నాయి.
– కొవ్వూరి మదన్ తేజ, హలీం పాయింట్ నిర్వాహకుడు, ఎన్టీఆర్ పార్క్
వందలాది మందికి ఉపాధి
వందలాది మందికి ఉపాధి
వందలాది మందికి ఉపాధి
వందలాది మందికి ఉపాధి
Comments
Please login to add a commentAdd a comment