లక్షణాలిలా..
బీపీ, షుగర్ ఉండే వారిలో రావొచ్చు. ఇంట్లో ఎవరికై నా ఉంటే వారి బిడ్డలకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా కంటికి గాయమైతే అది కాలక్రమంలో గ్లకోమాకు దారితీయొచ్చు. పిగ్మెంటరీ డిస్పర్షన్ సిండ్రోమ్ సోకినా, కొన్ని రకాల కార్టికో స్టెరాయిడ్స్ వాడినా గ్లకోమాకు గురికావొచ్చు. కంటి నొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు, చూపు అస్పష్టంగా ఉండటం, ప్రకాశవంతమైన లైట్ల చుట్టూ ఇంద్రధనస్సు – రంగుల వృత్తాలు కనిపించడం, కన్ను ఎరుపెక్కడం, కంటి నుంచి నీరు రావడం, ఇరుకై న దృష్టి లాంటి లక్షణాలుంటే గ్లకోమాగా అనుమానించి నేత్ర వైద్యుని సంప్రదించాలి.
నెల్లూరు(అర్బన్): కాలుష్యం, స్క్రీన్‌కు అతుక్కుని పోవడం, కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం, ఎప్పుడైనా పురుగు పడటం, కన్నును ఎప్పుడో రుద్దడం, వంశపారంపర్యం తదితర వాటివల్ల మనుషులకు నీటి కాసులు (గ్లకోమా) వ్యాధి వస్తుంది. ఫలితంగా తెలియకుండానే క్రమేపీ చూపు కోల్పోవడం జరుగుతుంది. దృష్టిని దొంగిలించే వ్యాధిగా పేరున్న గ్లకోమా పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని నేత్ర డాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు గ్లకోమా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది మార్చి 12వ తేదీని ప్రపంచ గ్లకోమా డేగా ప్రకటించింది. జిల్లాలో అంధత్వ నివారణ శాఖ అధికారులు ప్రజలను చైతన్యం చేస్తున్నారు.
దెబ్బతింటూ..
గ్లకోమా అనేది ఒక్కసారిగా బయటపడదు. కొంచెం, కొంచెంగా చూపు దెబ్బతింటూ వస్తుంది. ఈలోపు డాక్టర్లను సంప్రదించి వైద్యం చేయించుకుంటే సరే. లేకుంటే చూపును కోల్పోతారు. అప్పటి వరకు పోయిన చూపును తిరిగి తీసుకునిరాలేం. మిగిలిన చూపును మందులతో కాపాడుకోవచ్చు. గ్లకోమాతో ఒక కంటి చూపు పూర్తిగా పోయినవారు జిల్లాలో అనేకమంది ఉన్నారు. మరొక కన్ను చూపు కూడా తగ్గిపోయిన వారున్నారు. ఇలా పాక్షికంగా, పూర్తిస్థా యిలో చూపును కోల్పోయిన బాధితులు సుమారు 2.70 లక్షల మంది వరకు ఉన్నారని వైద్యుల అంచనా.
వైద్యరీక్షలు తప్పనిసరి
గ్లకోమాకు గురైన వారిలో ప్రధానంగా కంటి లోపల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కన్ను వెనుక వైపు ఉండే ఆప్టిక్ నాడిని దెబ్బతింటుంది. కంటి నుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని ప్రసారం చేసే వ్యవస్థకు ఆటంకం కలిగి చూపును కోల్పోవడం జరుగుతుంది. 40 సంవత్సరాల వయసు పైబడిన వారు ప్రతి ఆరునెలలకు ఒకోసారి తప్పనిసరిగా కంటి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్ ఉన్న వారు క్రమం తప్పకుండా చేయించుకుంటే మంచిది. కన్ను ఎరుపెక్కినా, నీరు కారుతున్నా తక్షణమే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో లేజర్ చికిత్సతో చూపును కాపాడతారు. మందులు, లేజర్ చికిత్సలు కూడా సరిగా పని చేయని సందర్భంలో డాక్టర్లు గ్లకోమా సర్జరీలు చూడా చేస్తున్నారు.
కంటి లోపల అధిక ఒత్తిడితో ఈ వ్యాధి
ఆప్టిక్ నరం దెబ్బతిని
చూపును కోల్పోయే ప్రమాదం
జిల్లాలో పదిశాతం మంది రోగులు
నేడు ప్రపంచ గ్లకోమా డే
అవగాహన పెంచుకోవాలి
గ్లకోమాపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అప్పుడప్పుడు నేత్ర వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా గ్లకోమాను గుర్తిస్తే వైద్యం చేయడం ద్వారా అరికట్టగలం. ప్రస్తుతం ఆధునిక మందులు వచ్చాయి. ఇవి చూపును పరిరక్షించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నాయి. జిల్లా అంధత్వనివారణ సంస్థ తరఫున తాము అన్ని ఆస్పత్రుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.
– డాక్టర్ శార్వాణి, జిల్లా అంధత్వ నివారణ అధికారిణి
Comments
Please login to add a commentAdd a comment