
గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన వీఎస్‌యూ వీసీ
వెంకటాచలం: రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను విక్రమసింహపురి యూనివర్సిటీ(వీఎస్‌యూ) వీసీ అల్లం శ్రీనివాసరరావు, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. వీఎస్‌యూ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను వివరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తిని కూడా మర్యాద పూర్వకంగా కలిశారు.
వైఎస్సార్‌సీపీలో
పలువురి నియామకం
నెల్లూరు (బారకాసు): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో జిల్లాకు చెందిన పలువురిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్‌గా సయ్యద్ హంజాహుస్సేని, మైనార్టీ సెల్ సెక్రటరీలుగా షేక్ అలిఅహ్మద్, ఎస్‌కే షాహుల్‌హమీద్ నియమితులయ్యారు. మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీలు గా షేక్ మొయినుద్దీన్, షేక్ అహ్మద్, మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిగా సయ్యద్ అబ్దుల్ సలీం, రాష్ట్ర ఐటీ వింగ్ అధికార ప్రతినిధిగా పూసపాటి జగన్‌మోహన్‌రెడ్డి నియమితులయ్యారు.
మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి
ముత్తుకూరు: మండలంలోని నేలటూరులో ఉన్న శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌లో మూడు యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి జరుగుతోందని ప్రాజెక్ట్ ఇంజినీర్లు శుక్రవారం తెలిపారు. 1వ యూనిట్లో 250, 2వ యూనిట్లో 310, 3వ యూనిట్లో 410 మెగావాట్ల వంతున విద్యుదుత్పత్తి జరుగుతోందని వివరించారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన వీఎస్‌యూ వీసీ