
నాణ్యతకు మారుపేరు భారతి సిమెంట్
సంగం: భారతి సిమెంట్ నాణ్యతకు మారుపేరని ఆ సంస్థ సేల్స్ ఆఫీసర్ బాబ్జాన్, సీనియర్ టెక్నికల్ అధికారి ఎన్.భవానీశంకర్ తెలిపారు. మండల కేంద్రమైన సంగంలోని భారతి ట్రేడర్స్ భవన నిర్మాణ మేసీ్త్రలు, కార్మికులకు సోమవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధునాతన పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయారవుతుందన్నారు. కట్టడాలు దీర్ఘకాలం ఉండేందుకు దోహద పడుతుందన్నారు. సిమెంట్ తయారీకి నాణ్యమైన ముడి పదార్థాలను తమ కంపెనీ ఎంచుకుంటుందన్నారు. ఈ సిమెంట్‌తో వేసిన శ్లాబులను ఏడురోజుల అనంతరం కంపెనీ ప్రతినిధులు పరీక్షించి నాణ్యతను మేసీ్త్రలు, యజమానులకు వివరిస్తారన్నారు. ఇందుకు సంబంధిత డీలర్ ద్వారా వివరాలు తెలుసుకుని సమాచారం అందిస్తే సరిపోతుందన్నారు. సదస్సుకు హాజరైన మేసీ్త్రలు, కార్మికులకు రూ.లక్ష చొప్పున ఉచిత బీమా సదుపాయం కల్పించి బాండ్లను అందజేశారు. కార్యక్రమంలో భారతి ట్రేడర్స్ అధినేత రమేష్ తదితరులు పాల్గొన్నారు.