
అధికారుల మీనమేషాలు
కొత్తూరు బిట్ – 2లో కండలేరు ముంపు బాధితుల పునరావాస స్థలంలో బావులను పూడ్చేసి ఆక్రమించిన వ్యక్తిపై ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదని వి.రమేష్‌రెడ్డి జేసీకి వినతిపత్రం సమర్పించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంతారావు అనే వ్యక్తి సదరు స్థలాన్ని అమ్మేందుకు బహిరంగంగా అతని ఫోన్ నంబర్‌ను తూములపై రాసినా అధికారుల్లో చలనం లేదన్నారు. నాలుగోసారి గ్రీవెన్స్‌కు వచ్చానన్నారు. తహసీల్దార్ లాజరస్, ఆర్‌ఐ, వీఆర్వోలు కనీసం వచ్చి పరిశీలించలేదన్నారు. వినతిని పరిశీలించిన జేసీ తహసీల్దార్‌కు అప్పటికప్పుడే ఫోన్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని రమేష్‌రెడ్డి తెలిపారు.