సొసైటీ భవనం నేలమట్టం
హిందూపురం: రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువుదీరింది. అధికార టీడీపీ నాయకుల్లో కొందరు అడ్డగోలు సంపాదనకు బరితెగించారు. రూ.కోట్లు విలువ చేసే స్థలం కబ్జాకు పథక రచన చేశారు. ఇందులో భాగంగా హిందూపురంలోని మెయిన్‌బజార్‌లోని పేట వెంకటరమణస్వామి ఆలయం పక్కనున్న పాల రైతుల కోఆపరేటివ్ సొసైటీ భవనం రెండురోజుల క్రితం కూల్చివేశారు.
1938లో దాదాపు 177 మంది పాడి రైతులు కలిసి మూడు సెంట్లకు పైబడి స్థలాన్ని కొనుగోలు చేసి సొసైటీ భవనం నిర్మించుకున్నారు. ఆ రోజుల్లో దాదాపు వెయ్యి లీటర్ల పాలు సేకరించి విక్రయించే వారు. కాలక్రమేణ వ్యాపారాలు తగ్గిపోవడంతో సొసైటీని మూసివేశారు. గత ఐదేళ్ల క్రితం సొసైటీ భవన స్థలం కాజేయడానికి ప్రయత్నాలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలో రావడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో టీడీపీ నాయకులు కొందరు మున్సిపాలిటీ పరిధిలో ఖాళీస్థలాలు, పాత భవనాలపై కన్నేశారు. అందులో భాగంగా రూ.2 కోట్లకు పైబడి విలువ చేసే పాల సొసైటీ స్థలం కాజేయాలని అర్ధరాత్రి సమయంలో భవనాన్ని జేసీబీ యంత్రాలతో కూలి్చవేశారు. ఈ భవనంలోని వందకు పైగా పాలు నిల్వ చేసే సిల్వర్, అల్యూమినియం వంద లీటర్ల క్యాన్లు, లాకర్లు, పాల కూలింగ్ మిషన్, జనరేటర్, కొంత నగదు, డాక్యుమెంట్లు ఇతర వస్తువులన్నీ మాయమైపోయాయి.
స్థలం కాజేయాలనే ఎత్తుగడ
ఏళ్లకాలం నాటి పాడి రైతుల సొసైటీ భవన స్థలాన్ని కొందరు కాజేయాలని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ సొసైటీలో వందమందికి పైగా రైతులు షేర్‌హోల్డర్స్‌గా ఉన్నారు. కూలి్చవేసిన భవనంలోని చాలా విలువైన సామగ్రి, డ్యాకుమెంట్లు మాయమైపోయాయి. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. పోలీసు అధికారులు కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– విజయకుమార్,హిందూపురం
Comments
Please login to add a commentAdd a comment