భయంతోనే ప్రతిపక్ష హోదా నిరాకరణ
పరిగి: ‘‘కుట్రలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ నిబంధనలు పాటించడం లేదు. 40 శాతం ఓటు బ్యాంకు సాధించిన వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తోంది. స్పీకర్, డిప్యూటీ స్వీకర్ కూడా దీనిపై స్పందించకపోవడం దారుణం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అగౌరవపర్చాలని కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. కానీ ప్రజలు అప్రజాస్వామ్య చర్యలన్నీ గమనిస్తున్నారు. ప్రజాగ్రహం ముందు ఎవరైనా తలవంచాల్సిందే. కూటమి సర్కార్ కూడా కూలడం ఖాయం’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, ఆ పార్టీ పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ అన్నారు. సోమవారం ఆమె పరిగిలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజా సమస్యలను చర్చించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వెళ్లారన్నారు. కానీ అధికారం చేపట్టి ఎనిమిది నెలలు కావస్తున్నా... ప్రతిపక్ష హోదాను కల్పించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశంపై నివేదిక ఇవ్వాలని స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను హైకోర్టు ఆదేశించినప్పటికీ వారు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే తమ బండారం బయటపడుతుందన్న భయంతోనే కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇది ఎల్లకాలం జరగదన్న విషయం కూటమి నాయకులు గుర్తెరగాలన్నారు. సంక్షేమ పథకాలివ్వకుండా మాటలకే పరిమితమవుతున్న చంద్రబాబుకు జనమే బుద్ధిచెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. సమావేశంలో మండల కన్వీనర్ నరసింహమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి విలువలేదా?
స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు
స్పందించకపోవడం బాధాకరం
ప్రజాగ్రహంతో ‘కూటమి’
కుప్పకూలడం ఖాయం
విలేకరులతో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
Comments
Please login to add a commentAdd a comment