జాతీయ స్థాయికి ఏపీఎంఎస్ విద్యార్థుల ‘ఆవిష్కరణ’
పుట్టపర్తి టౌన్: పాఠశాల విద్యార్థులను భవిష్యత్తులో ఆవిష్కర్తలుగా, వ్యవస్థాపకులుగా మార్చడంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘మేడ్ ఇన్ 3డీ – సీడ్ ది ఫ్యూచర్ ఎంటర్‌ప్రెన్యూర్స్’కు ధర్మవరంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. స్థానిక సమస్యలు గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు చూపించే ప్రయత్నం చేసిన విద్యార్థులను డీఈఓ కృష్ణప్ప సోమవారం అభినందించారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో వంద పాఠశాల విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. 5 ఆవిష్కరణలు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. ఇందులో చేనేత పరిశ్రమకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపుతూ ధర్మవరం ఏపీమోడల్ స్కూల్ గైడ్ టీచర్ శ్రావణి ఆధ్వర్యంలో విద్యార్థులు సుజయ్, హేమంత్‌కుమార్, లాస్య, జ్యోతి, గుణశ్రీ, మేఘన రూపొందించిన ఆవిష్కరణ ఉండడం విశేషం.
ఆర్డీఓలు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
ప్రశాంతి నిలయం: రీ సర్వే పనుల పర్యవేక్షణకు ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ, డివిజనల్ రెవెన్యూ అధికారుల లాగిన్‌లలో లక్షకుపైగా రికార్డులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఈ నెల 28లోగా ధ్రువీకరించాలని ఆదేశించారు. భూముల ఫ్రీ హోల్డ్ సంబంధించిన అంశాలను నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు. ఎంఎస్‌ఎంఈ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment