కమనీయం.. గౌరీశంకరుల కల్యాణం
● పూర్ణాహుతితో నేడు ముగియనున్న అతిరుద్ర యజ్ఞం
ప్రశాంతి నిలయం: వేదపండితుల మంత్రోచ్ఛారణలు... భక్తుల జయజయధ్వానాల మధ్య గౌరీశంకరుల కల్యాణం కమనీయంగా సాగింది. విశ్వశాంతిని కాంక్షిస్తూ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేపట్టిన అతిరుద్ర మహాయజ్ఞం సోమవారమూ కొనసాగింది. ఉదయం వేదపండితులు యజ్ఞ క్రతువులను నిర్వహించారు. సాయంత్రం గౌరీశంకరుల కల్యాణం జరిపించారు. అనంతరం సాయి కార్తీక్ జ్ఞానేశ్వర్ బృందం సంగీత కచేరీ నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. కాగా, అతిరుద్ర మహాయజ్ఞం మంగళవారం పూర్ణాహుతితో ముగియనుంది.
కమనీయం.. గౌరీశంకరుల కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment