రజినికి జాతీయ అవార్డు
మడకశిర రూరల్: ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆమిదాలగొందికి చెందిన రజినికి జాతీయ అవార్డు దక్కింది. ఆదివారం నాగపూర్‌లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రజినికి కేంద్ర ప్రభుత్వంలోని ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు అవార్డు అందజేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా వివిధ రకాల పంటలను సాగు చేయడంతో పాటు తన తోటి రైతులనూ ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లించిన రజిని కృషి అమోఘమని కొనియాడారు. కాగా జాతీయ అవార్డుతో జిల్లాకు పేరు తెచ్చిన రజినిని జిల్లా ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్, మడకశిర డివిజన్ ఇన్‌చార్జ్ రమేష్, రైతు సాధికార సంస్థ కమ్యూనికేషన్ టీమ్ సభ్యురాలు కీర్తన, యూనిట్ ఇన్‌చార్జ్ మంజునాథ్, సిబ్బంది అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment