రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం
● చేనేత కళాకారుడికి అరుదైన అవకాశం
ధర్మవరం: న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ధర్మవరం చేతివృత్తుల కళాకారుడు చిప్పల చంద్రశేఖర్‌కు ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం చేతివృత్తుల వారికి ప్రోత్సాహం కల్పించేందుకు ఎబిలిటీ ఎక్స్‌పో – 2025 డ్యూరింగ్ ద పర్పుల్ ఫెస్ట్‌లో భాగంగా చేతి వృత్తుల కళాకారుల ప్రదర్శన కోసం రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం పంపారు. చిప్పల చంద్రశేఖర్ ప్రస్తుతం ఆర్డీటీ సంస్థలో చేతివృత్తులపై మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. దేశ రాజధానిలో చేతివృత్తుల ప్రత్యేకతను తెలియజేయడం గొప్ప విషయమని చంద్రశేఖర్ తెలిపారు. ఈనెల 21తేదీ ప్రదర్శన ఉంటుందన్నారు.
వీఆర్‌కు కొత్తచెరువు సీఐ ఇందిర
పుట్టపర్తి టౌన్: కొత్తచెరువు అప్‌గ్రేడ్ పోలీస్టేషన్ సీఐగా పనిచేస్తున్న ఎంపీ ఇందిరను వీఆర్‌కు పంపుతూ అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో వీఆర్‌కు రిపోర్టు చేసుకోవాలని సూచించారు. గతంలో కొన్ని కేసుల్లో న్యాయం చేయలేకపోవడం, వరుస హత్యలు, దొంగతనాలు లాంటి కేసుల్లో బాధితులకు న్యాయం చేయలేదన్న ఆరోపణలతోనే చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.