రెడ్డెప్పశెట్టికి ఎవిక్షన్ నోటీసు జారీ
చిలమత్తూరు: రియల్టర్ రెడ్డెప్పశెట్టికి ఎట్టకేలకు ఎవిక్షన్ నోటీసును రెవెన్యూ అధికారులు జారీ చేశారు. రెడ్డెప్పశెట్టి ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని కంచె మొత్తం తొలగించి రైతులకు ఊరట కలిగించే చర్యలకు శ్రీకారం చుట్టారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు, నిబంధనలకు విరుద్దంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన రెడ్డెప్పశెట్టి అక్రమాలపై ఇటీవల ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆర్డీవో ఆనంద్‌కుమార్, చిలమత్తూరు ఇన్‌చార్జ్ తహసీల్దార్ వెంకటేష్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి, వాస్తవాలు గుర్తించారు. అయితే ఈ పర్యటనను అధికారులు గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. రెడ్డెప్పశెట్టి వ్యవహారంలో ఇప్పటికే తహసీల్దార్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ రహస్య తనిఖీలు దేనికి సంకేతమంటూ ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. రైతుల నుంచి అసైన్డ్ భూములను రెడ్డెప్పశెట్టి కొనుగోలు చేసినట్టుగా అధికారుల విచారణలో వెల్లడైంది. అసైన్‌మెంట్ యాక్ట్ ప్రకారం రైతులకు సాగు కోసం ఇచ్చిన పట్టాలను కొనడానికి, అమ్మడానికి వీల్లేదు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ భూములను రెడ్డెప్పశెట్టి కొనుగోలు చేసినట్టుగా నిర్ధారణ అయింది. రెడ్డెప్పశెట్టి కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో.. లేదో వేచి చూడాలి.
కంచె తొలగింపు, భూ ఆక్రమణలపై స్పందించిన అధికారులు
అసైన్డ్ భూముల కొనుగోలును
రద్దు పరిచేందుకు కసరత్తు?
ఎస్టేట్‌లో పెనుగొండ ఆర్డీఓ,
తహసీల్దార్ రహస్య పర్యటన
Comments
Please login to add a commentAdd a comment