‘పగబట్టిన విధి’పై స్పందించిన అధికారులు
తాడిమర్రి: డయాలసిస్ చేయించుకునేందుకు అనంతపురానికి వెళ్లి వచ్చేందుకు ప్రత్యేకంగా 108 అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామని నిరుపేద కుటుంబానికి అధికారులు భరోసానిచ్చారు. ఓ వైపు బుద్ధిమాంద్య కుమార్తెల పోషణ, మరో వైపు భర్త డయాలసిస్ కోసం నిరుపేద మహిళ పడుతున్న ఇబ్బందులపై ‘పగబట్టిన విధి’ శీర్షికన ఈ నెల 17న ‘సాక్షి’లో వెలువడిన కథనం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎంపీడీఓ వెంకటరంగారావు, తహసీల్దార్ భాస్కరరెడ్డి, ఈఓఆర్డీ విజయశేఖర్‌నాయుడు, వైద్యాధికారి హరిత తదితరులు గురువారం తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామానికి చెందిన బాధిత భూమే లక్ష్మయ్య, సుభద్రమ్మ దంపతుల ఇంటిని సందర్శించారు. కుటుంబ ఆర్థిక స్థితిగతులను పరిశీలించారు. కుటుంబ దైన్య స్థితిపై చలించిన అధికారులు సమస్యను కలెక్టర్, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మంత్రి సత్యకుమార్‌యాదవ్ పీఏతో చర్చించి లక్ష్మయ్యను డయాలసిస్ కోసం తీసుకెళ్లి, తిరిగి గ్రామానికి చేర్చేందుకు 108 అంబులెన్స్ వాహనాన్ని ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని భరోసానిచ్చారు.
డయాలసిస్‌కు వెళ్లి వచ్చేందుకు
108 వాహనం ఏర్పాటుకు భరోసా
‘పగబట్టిన విధి’పై స్పందించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment