
కాక రేపుతున్న కొల్లేరు
అనంతపురం: ఐపీఎల్ తరహాలో సాగుతున్న ఏపీ సూపర్ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో కొల్లేరు క్లబ్ జట్టు కాకరేపుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏపీ సూపర్ కప్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలిపి 8 జోన్‌లుగా, 8 క్లబ్‌లుగా విభజించి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో కొల్లేరు క్లబ్ జట్టులో ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. లీగ్ కం నాకౌట్ పద్థతిలో సాగుతున్న ఈ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. అనంతపురంలోని ఆర్డీటీ క్రీడాగ్రామం వేదికగా సాగుతున్న ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో అన్నింటా విజయం సాధించి కొల్లేరు క్లబ్ జట్టు 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో నల్లమల క్లబ్ జట్టుపై తలపడిన విశాఖ క్లబ్... 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో తుంగభద్ర క్లబ్‌పై ఏకంగా ఐదు గోల్స్ సాధించి గోదావరి క్లబ్ జట్టు (5–0) విజయం కై వసం చేసుకుంది. కొల్లేరు–కోరమాండల్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లో 2–0 గోల్స్ తేడాతో కొల్లేరు క్లబ్ విజయకేతనం ఎగురవేసింది.
Comments
Please login to add a commentAdd a comment