క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేయొద్దు
పుట్టపర్తి అర్బన్: క్షయ వ్యాధిపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకంగా మారుతుందని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజా బేగం అన్నారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య, జిల్లా క్షయ నివారణ శాఖల ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ప్రశాంతి గ్రామంలోని వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. ప్రధాన మంత్రి క్షయ పోషణ పథకంలో భాగంగా క్షయ చికిత్స చేయించుకున్న వారికి నెలకు రూ.1000 అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ తిప్పయ్య, డీఎస్పీ విజయ్‌కుమార్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్‌రెడ్డి, ధర్మవరం ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వాసుదేవరెడ్డి, టీబీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 29 పంచాయతీలకు కలెక్టరేట్‌లో అవార్డులను అందజేశారు.
హంద్రీ–నీవా కాలువ
లైనింగ్ పనులు ఆపాలి
● ఏపీ రైతు సంఘం రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి
పుట్టపర్తి టౌన్: హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు ఆపి కాలువ వెడల్పు చేయాలని, లైనింగ్ పనులు ఆపకపోతే ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో యంత్రాలు ధ్వంసం చేస్తామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం పుట్టపర్తిలోని కార్మిక కర్షక భవనంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు గిరీషం, సీపీఐ జిల్లా నాయకులు కాటమయ్య, మహదేవ పాల్గొని ప్రసంగించారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులతో భూగర్భజలాలు అడుగంటి రైతులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. జీఓ నంబర్ 404, 405ను తక్షణమే రద్దు చేయాలని, హంద్రీనీవా కాలువ వెడల్పు పనులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సోముశేఖర్, రమణ, లక్ష్మీనారాయణ, రాజా రామిరెడ్డి, సిద్ధారెడ్డి, కదిరెప్ప, మారుతి, శ్రీరాములు,నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేయొద్దు