
అవగాహన కల్పిస్తున్నాం
క్షయ నివారణకు పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ఒకరి నుంచి సగటున మరో 15 మందికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వ్యాధి సోకే విధానం, ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. దీర్ఘకాలికంగా దగ్గు ఉన్నా.. ఆకలి మందగించినా.. బరువు తగ్గినా.. వెంటనే సమీపంలోని పీహెచ్‌సీలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిది. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ తిప్పయ్య,
జిల్లా క్షయ అధికారి, పుట్టపర్తి