హిందూపురం: అసలే వర్షాలు అంతంతమాత్రం. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్న నేపథ్యంలో పచ్చదనం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెట్లను పరిరక్షించుకోవాల్సి ఉండగా కొందరు క్షణాల్లో కూల్చేస్తున్నారు. ఇందుకు అటవీ శాఖ అధికారులు కూడా అనుమతులు ఇవ్వడం గమనార్హం. హిందూపురంలోని గుడ్డం రంగనాథస్వామి ఆలయ సమీపాన విశాలమైన మైదానంలో అనేక ఏళ్లుగా ఫలసాయం అందిస్తున్న 21 చింత చెట్లను ఆదివారం యంత్రాల సాయంతో కూకటివేళ్లతో పెకలించి ముక్కలు చేసేశారు.
జిల్లా వ్యాప్తంగా
పోలీసుల తనిఖీలు
పుట్టపర్తి టౌన్: శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీ తదితర చర్యలు చేపట్టారు. రాత్రివేళ గస్తీలు చేపడుతూ నైట్ బీట్ చెకింగ్‌లు ఏర్పాటు చేసి అనుమానితు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై ప్రత్యేకడ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగిస్తూ ప్రమాదాలు జరగకుండా సూచనలు చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. హెల్మెట్ ఫేస్‌వాష్‌పై కూడా అవగాహన కలిగిస్తున్నారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గంజాయి, అక్రమ మద్యం రవాణా, నాటుసారాలపై దాడులు చేస్తున్నారు. గ్రామాలను సందర్శించి గొడవలకు వెళ్లకుంగా ప్రశాతంగా జీవించాలని అవగాహన కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీ ఎంపిక
పుట్టపర్తి టౌన్: జిల్లా పంచాయతీ కార్యదర్శుల (డిజిటల్ అసిస్టెంట్లు) సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం పట్టణంలోని సాయి ఆరామంలో జిల్లా ఇన్‌చార్జ్ చౌడప్ప ఆధ్వర్యంలో పంచాయితీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్లు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చౌడప్ప, ఉపాధ్యక్షులుగా ప్రశాంతి, భార్గవ్ చౌదరి, జనరల్ సెక్రటరీగా లోకేష్, ట్రెజరర్‌గా రసూల్, జాయింట్ సెక్రటరీలుగా బాలాజీ, సాదిక్‌బాషా, సతీష్, శంకర, కమిటీ మెంబర్లుగా ప్రకాశ్, అశోక్, చంద్రశేఖర్, రవికాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
ఎస్సీ కాలనీలో
విద్యుత్ కనెక్షన్లు కట్
బత్తలపల్లి: పోట్లమర్రి ఎస్సీ కాలనీలో 200 యూనిట్లకు మించి వినియోగించిన వారి విద్యుత్ కనెక్షన్లను అధికారులు కట్ చేశారు. కాలనీలో దాదాపు వంద కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ జగ్జీవన్ జ్యోతి స్కీం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలవుతోంది. అయితే 20 కుటుంబాల వారు 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించడంతో ఉచితం పరిధి దాటి బిల్లు పరిధిలోకి వచ్చారు. ఆ డబ్బు చెల్లించకపోవడంతో ఆదివారం 12 మంది సిబ్బంది కాలనీలోకి వచ్చి సదరు వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. తమకు గడువు ఇస్తే చెల్లిస్తామని ప్రాధేయపడినా వినలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
నేలకూలిన భారీ వృక్షాలు
నేలకూలిన భారీ వృక్షాలు