జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తా..
వెయిట్ లిప్టింగ్‌లో జాతీయ స్థాయిలో రాణించి బంగారు పతకాన్ని సాధించాలని ఉంది. ఆ దిశగా సాధన చేస్తున్నా. పాఠశాలలో సౌకర్యాలు లేకపోయినప్పటికీ హెచ్‌ఎం జగదీశ్వర్, పీడీ నాగరాజు ప్రోత్సాహంతో క్రీడల్లో రాణిస్తున్నా.
– సుభాష్, విద్యార్థి
బంగారు పతకం నాదే
ఇప్పటికే పవర్ లిఫ్టింగ్‌లో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాన్ని సాధించాను. త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ బంగారు పతకం నాదే అవుతుంది. ఈ కలను సాకారం చేసుకునేందుకు ఇప్పటి నుంచే క్రమం తప్పకుండా సాధన చేస్తున్నా.
– గణేష్‌రెడ్డి, విద్యార్థి
పుట్టపర్తి: వసతులు లేవు... క్రీడా సామగ్రి లేదు... సాధన చేసేందుకు సరైన మైదానమూ లేదు. అయినా వారు పట్టు వీడలేదు. గత ఐదేళ్లలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విశేష ప్రతిభతో రాణిస్తున్నారు. బుక్కపట్నంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు. పట్టుదల.. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు.
ఏటా పతకాల వర్షం
బుక్కపట్నంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ ఏటా క్రమం తప్పకుండా క్రీడా పోటీల్లో పాల్గొంటూ పతకాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు గణేష్‌రెడ్డి, సుభాష్, ముక్తియార్, చరణ్ ప్రకాష్, శ్రీనాథ్‌రెడ్డి తదితరులు జాతీయ స్థాయి పవర్ లిప్టింగ్, వెయిట్ లిప్టింగ్, హాకీ, ఏపీ స్కూల్ గేమ్స్‌లలో రాణించి, పతకాలతో మెరిసారు. 2019లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో 65, 95, 125 కిలోల బరువెత్తి తొలిసారిగా రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థి ప్రకాష్ ఎంపికయ్యాడు. ఆ తర్వాత క్రీడలపై విద్యార్థుల్లో ఆసక్తి మొదలైంది. దీంతో విద్యార్థులకు ఆసక్తి ఉన్న వివిధ క్రీడల్లో వారిని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తూ వచ్చారు. 2022–23లో విజయవాడ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గణేష్‌రెడ్డి, చరణ్, ముక్తియార్ ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిలో సుభాష్ బంగారు పతకాన్ని సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం విశేషం. ఈ విద్యా సంవత్సరంలో పవర్ లిప్టింగ్‌లో రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గణేష్ రెడ్డి అద్భుత ప్రదర్శన కనబరిచి బంగారు పతకాన్ని సాధించి, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు.
క్రీడల్లో రాణిస్తున్న బుక్కపట్నం
విద్యార్థులు
జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో
పతకాల కై వసం
దాతల సహకారంతోనే..
పాఠశాలలో క్రీడా సామగ్రి కొరత చాలా ఉంది. సరైన మైదానం కూడా లేదు. దాతల సహకారంతో క్రీడా సామగ్రిని కొనుగోలు చేసి విద్యార్థులకు రోజూ శిక్షణ ఇస్తున్నాం. ఫలితంగా వారు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు గుర్తింపు తెచ్చారు.
– నాగరాజు, పీడీ,
బాలుర ఉన్నత పాఠశాల, బుక్కపట్నం
చాలా ఆనందంగా ఉంది
మా పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో రాణిస్తుండడం చాలా ఆనందంగా ఉంది. దాతల సహకారంతో క్రీడా సామగ్రిని సమకూర్చుకొని విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం.
– జగదీశ్వర్, హెచ్‌ఎం, బాలుర ఉన్నత పాఠశాల, బుక్కపట్నం.
గ్రామీణ విద్యార్థులు... పతకాల వీరులు
గ్రామీణ విద్యార్థులు... పతకాల వీరులు
గ్రామీణ విద్యార్థులు... పతకాల వీరులు
గ్రామీణ విద్యార్థులు... పతకాల వీరులు