స్వర్ణోత్సవ సంబరం
చదువు.. కొలువు ఇక్కడే
కొత్తూరులో 1974లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడంతో ఉన్నత చదువులు చదివేందుకు ఉపయోగపడింది. ఇక్కడే ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఈ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది.
– సుందరరావు, పూర్వ విద్యార్థి, పారాపురం
ఆనందంగా ఉంది..
గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల పుణ్య మా అని పూర్వ విద్యార్థులంతా ఒకే వేదిక వద్ద కలుసుకోవ డం ఆనందంగా ఉంది. చదు వుకున్న కాలేజీ రుణం తీర్చుకునేందుకు విరాళాలు అందించడంతో మౌలిక వసతులు మెరుగుపడతాయి.
– ఏ.గోవిందరావు, పూర్వ విద్యార్థి, ఇరపాడు
గర్వకారణం
గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించడం, 43 ఏళ్ల తర్వాత స్నేహితులను కలవడం గర్వంగా ఉంది. ఇటువంటి ఉత్సవాలు నిర్వహించడం వల్ల సరికొత్త అనుభూతి కలుగుతుంది. అప్పటి అధ్యాపకులను కలవడం మర్చిపోలేని అనుభూతి.
– బసప రాంబాబు, పూర్వ విద్యార్థి, పారాపురం
మొదటి ప్రిన్సిపాల్ ఎద్దు గోపాలదాసునాయుడికి సత్కరిస్తున్న దృశ్యం
● ఘనంగా కొత్తూరు జూనియర్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ
ఉత్సవాలు
● పూర్వ అధ్యాపకులకు సత్కారం
కొత్తూరు: కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ బండారి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆనాటి ప్రిన్సిపాల్, అధ్యాపకులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆనాటి అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ తిరుమల చైతన్య మాట్లాడుతూ మార్కులు ఒక్కటే కొలమానం కాదని, నైతిక విలువలు పాటిస్తూ జీవితంలో ముందుకు సాగాలని యువతరానికి పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన దాతలకు ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ ప్రిన్సిపాళ్లు ఎద్దు గోపాలదాసునాయుడు, డి.సీతారాములు, సోమలింగం, యాసిమ్, లోకనాథం, బీఎన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణోత్సవ సంబరం
స్వర్ణోత్సవ సంబరం
స్వర్ణోత్సవ సంబరం
స్వర్ణోత్సవ సంబరం
Comments
Please login to add a commentAdd a comment