వాసుదేవుడి పెళ్లికి ఊరంతా అతిథులయ్యారు. దేవదేవుడి కల్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు తన్మయత్వం చెందారు. మందసలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గోపినంబాళ్ల దాసు కూర్మాచార్యులు, వేదపండితులు, అర్చకులు కల్యాణ క్రతువు నిర్వహించారు. పూబంతులాట, పుష్ప మాల నృత్యాలు, కట్న చదివింపులు సంప్రదాయబద్ధంగా జరిగాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆండాళ్లగోష్టి, మహిళల కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాత్రి గరుడ వాహనసేవలో కల్యాణ దంపతులైన శ్రీభూసమేత వాసుదేవుడ్ని మందస పురవీధుల్లో ఊరేగించారు.
–కాశీబుగ్గ
Comments
Please login to add a commentAdd a comment