ఆరోగ్యశ్రీ సేవలపై అసంతృప్తి
అరసవల్లి: జిల్లాలో వైద్యారోగ్య శాఖ సేవలు సామాన్యులకు దూరమవుతున్నాయని జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాల్లో ఆమె అధ్యక్షత వహిస్తూ మాట్లాడారు. 2వ, 4వ, 7వ స్థాయీ సంఘ సమావేశాల్లో పలు ప్రభుత్వ శాఖల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా రణస్థలం జెడ్పీటీసీ సభ్యుడు టొంపల సీతారాం మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రిమ్స్ సేవలతో పాటు ఆరోగ్యశ్రీ సేవలు దారుణంగా ఉన్నాయన్నారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్న కేసులకు పక్క జిల్లాల్లో అవే కేసులను ఎలా స్వీకరించి ఆపరేషన్స్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై రిమ్స్ సూపరింటెండెంట్ షకీలా మాట్లాడుతూ సేవలను మెరుగుపర్చుతామని సమాధానమిచ్చారు. అనంతరం పలు ఽశాఖల ప్రగతి నివేదికలపై సమీక్షించారు. మొత్తం ఏడు స్థాయీ సంఘ సమావేశాల్లో 2వ, 4వ, 7వ స్థాయి సమావేశాలు మాత్రమే జరిగాయి.
బాధితురాలికి న్యాయం చేయండి..
జిల్లా వైద్యారోగ్య శాఖలో ఫేక్ జాయినింగ్ ఆర్డర్ వ్యవహారంపై జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ ఆరా తీశారు. 4వ స్థాయీ సంఘ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నకిలీ ఉద్యోగాల పేరిట ఎస్.ధనలక్ష్మి అనే నిరుద్యోగి నుంచి రూ.4.50 లక్షలను వసూలు చేసిన వ్యవహారంపై కారకులపై చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణను ఆదేశించారు. దీనిపై డీఎంహెచ్‌వో మాట్లాడుతూ అక్రమ వసూళ్లు, నకిలీ జాయినింగ్ ఆర్డర్ వ్యవహారంపై విశాఖపట్నం రీజనల్ డైరక్టర్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారని వివరించారు. త్వరలోనే బాధ్యులపై చర్యలుంటాయని తెలిపారు. అనంతరం పలు ప్రభుత్వ శాఖల ప్రగతిపై సమీక్షించారు.
సామాన్యులకు దూరం
చేస్తున్నారని సభ్యుల ఆవేదన
మెరుగైన సేవలందించాలన్న
జెడ్పీ చైర్‌పర్సన్ విజయ
ఫేక్ సర్టిఫికెట్ల నిందితులపై చర్యలకు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment