పర్యాటక కేంద్రంగా ఎర్రముక్కాం తీరం
సోంపేట: మండలంలోని ఎర్రముక్కాం సముద్ర తీరం పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని జిల్లా పర్యాటకశాఖాధికారి నారాయణరావు అన్నారు. శుక్రవారం ఎర్రముక్కాం సముద్రతీరాన్ని టూరిజం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 75 తీర ప్రాంతాలు ఉన్నాయని, అందులో ఎర్రముక్కాం తీరంలో 500 మీటర్ల పొడవునా రాళ్లు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా ఉందన్నారు. పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాంతం అనువుగా ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ నాగరాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సూరాడ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
15 కేంద్రాల్లో గ్రూప్–2 పరీక్షలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని 15 కేంద్రాల్లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో శ్రీకాకుళం మండలంలో 8 కేంద్రాలు, ఎచ్చెర్ల మండలంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలను ఆఫ్‌లైన్ విధానంలో రాయాల్సి ఉంటుందన్నారు. 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–ఐ, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–ఐఐ పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సందేహాల కోసం కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నంబర్ 08942 240557ను సంప్రదించాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలైన కాలిక్యులేటర్, సెల్‌ఫోన్, స్మార్ట్ వాచ్, బ్లూ టూత్ వంటివి పరీక్షా కేంద్రంలోనికి అనుమతించమన్నారు.
పర్యాటక కేంద్రంగా ఎర్రముక్కాం తీరం
Comments
Please login to add a commentAdd a comment