క్యాంపస్ డ్రైవ్‌లో 54 మంది ఎంపిక
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం వీల్స్ ఇండియా కంపెనీ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌కు విశేష స్పందన లభించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలకు చెందిన 115 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 54 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా కంపెనీల ప్రతినిధులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఎంపికై న వారిని నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జి.దామోదరరావు, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ అధికారి బి.తులసీరావు, కంపెనీ ప్రతినిధులు దివాకర్, వాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment