● కిడ్ని దినోత్సవం నాడు విషాదం
టెక్కలి రూరల్: ప్రపంచ కిడ్నీ దినోత్సవం నాడే టెక్కలిలో డయాలసిస్ సేవలు పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. శ్రీనివాస నగర్‌కు చెందిన ఎస్.భాస్కర్(30) కొంత కాలంగా కిడ్ని వ్యాధి తో బాధపడుతున్నాడు. గురువారం తీవ్ర అస్వస్థత రావడంతో కుటుంబసభ్యులు హుటాహూటిన టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భాస్కర్ మృతి చెందాడు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం నాడు కిడ్ని వ్యాధితో యువకుడు మృతి చెంద డం బాధాకరమని పలువు రు ఆవేదన వ్యక్తం చేశారు.