20న తపాలా అదాలత్
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు మా ర్చి 20న శ్రీకాకుళంలోని రెల్లవీధిలో ఉన్న తపా లాశాఖ సూపరింటెండెంట్ వారి కార్యాలయం వద్ద తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ అఫ్ పోస్ట్ ఆఫీస్ వి.హరిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపా రు. తపాలా సేవలకు సంబంధించిన ప్రత్యేక వ్యక్తిగత ఫిర్యాదులు ఈ అదాలత్‌లో చర్చి స్తామని పేర్కొన్నారు. శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు మార్చి 20వ తేదీ లోగా ‘తపాల అదాలత్’ అనే శీర్షికతో వి హరిబాబు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసు, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్–శ్రీకాకుళం 532001‘ అనే చిరునామాకు పంపించాలని సూచించారు. ఫిర్యాదులు వ్యక్తిగతంగా కూడా తీసుకొని అదాలత్‌కు హాజరు కావచ్చునని పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన విషయాలపై ఫిర్యాదులు తీసుకోబోమని స్పష్టం చేశారు.
మెరుగైన ఫలితాలు సాధించాలి
నరసన్నపేట: జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధ తెలిపారు. స్థానిక బీసీ బాలికల వసతి గృహంలో ఆమె గు రువారం రాత్రి బస చేశారు. శుక్రవారం ఉద యం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు విద్యార్థుల దినచర్య పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బీసీ వసతి గృహాల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రిమ్స్ డ్యూటీ డాక్టర్ల
భోజనంలో పురుగులు
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లకు సరఫరా చేస్తున్న భోజనంలో పురుగులు వచ్చాయి. శుక్రవారం మధ్యాహ్న భోజనంలో పురుగులు రాగా, రాత్రికి మంచి ఆహారం వస్తుందని వైద్యులు భావించారు. రాత్రి భోజనంలో కూడా పురుగులు కనిపించడంతో డాక్టర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భోజనాలు మానేసి విధులు నిర్వహించారు. రిమ్స్‌లో విధులు నిర్వహించే డాక్టర్లకు ప్రభుత్వ పరంగా ఆహారాన్ని సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షకీల వద్ద ప్రస్తావించగా తాను మధ్యాహ్నం సమయంలో ఇక్కడే భోజనం చేస్తున్నానని, పురుగులు తన ఆహారంలో లేవన్నారు. ఇటీవలి కలెక్టర్ కూడా ఆస్పత్రిని తనిఖీ చేసిన సమయంలో భోజనాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.
20న తపాలా అదాలత్
Comments
Please login to add a commentAdd a comment