
పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఆయన సేవలు మరువలేనివని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నా రు. పొట్టి శ్రీరాములు 124వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం కార్పొరేషన్ కార్యాలయానికి సమీపంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పొట్టి శ్రీరాములు నడుచుకున్నారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఈరోజు రాష్ట్రంలో అంతా హాయిగా ఉండగలిగామన్నారు. కార్యక్రమంలో కళింగకుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, రాష్ట్రకార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ఎస్సీసెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, చింతాడ వరుణ్, అంబటి శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, ఎన్ని ధనుంజయరావు, మండవల్లి రవి, ఎం.ఏ భేగ్, సాదు వైకుంఠరావు, రౌతు శంకరరావు, గుండ హరీ ష్, పీస గోపి, కర్రి రంగాజీదేవ్, మూకళ్ల తాతబాబు, ఎండ రమేష్, సనపల నారాయణరా వు, కోట గోవిందరావు, డాక్టర్ శ్రీనివాసపట్నా యక్, పొన్నాడ రుషి, తంగుడు నాగేశ్వరరావు, కర్నేనహరి, తారక్, వానపల్లి రమేష్, రావాడ జోగినాయుడు, త్రినాథరెడ్డి పాల్గొన్నారు.
ప్రమాద స్థలం పరిశీలన
ఎచ్చెర్ల: లావేరు మండలం, బుడుమూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆదివారం ఉదయం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయం