ప్రమాదంలో నా రెండు కాళ్లు పోయాయి. పూర్తిగా చచ్చుబడ్డాయి. వికలాంగ పింఛన్ వస్తుందన్న ఆశతో ఇప్పటికి పలుమార్లు గ్రీవెన్స్‌కు వచ్చా. ఫలితం లేదు. ఏమంటే నా తండ్రికి ప్రభుత్వ ఉద్యోగమంటున్నారు. నా జీవనం పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా ఫించను ఇవ్వాలి.
– డి.రామ్‌కుమార్, హిరమండలం
ఆరుసార్లు ఫిర్యాదు చేశా..
1951లో 28 సెంట్లకు (సర్వే నెంబరు 49/10) రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. వెబ్‌ల్యాండ్‌లో మిస్సయిందని డాక్యుమెంట్లున్నా ఎస్‌ఎల్‌ఆర్‌లో ఎలా ఉంటే అలా పెట్టేశారు రెవెన్యూ వాళ్లు. ఇప్పటికి ఆరు సార్లు ఫిర్యాదు చేశా. పట్టించుకోవడం లేదు. – అల్లు రమణమూర్తి, రామదాసుపేట, జలుమూరు మండలం
పట్టా కోసం..
28 ఏళ్ల కిందటి నుంచి మా తాత డోల రామ్మూర్తికి 12 సెంట్ల స్థలం ఉంది. ఇందులో డీపట్టా 7 సెంట్లు తహసీల్దార్ ఖాళీ చేయించి వేరే వారికి ఇచ్చేశారు. ఉన్న ఐదు సెంట్లు జిరాయితీ. అందులో రేకుల షెడ్డు ఉంది. దానికై నా పట్టా ఇస్తారని కలెక్టర్‌కు విన్నవించుకుందామని వచ్చా. డోల రామ్మూర్తి పేరుతో
ఫిర్యాదు చేసిన మనవడు, చెట్టు పొదిలాం,
జి.సిగడాం మండలం
●
నా పరిస్థితి ఏంటి?