ఆక్రమణ స్థలం పరిశీలన
కవిటి: మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిని టీడీపీ నేత చదును చేయించడంపై సాక్షి పత్రికలో ‘చదును ఇదే అదును..!’ శీర్షికతో బుధవారం ప్రచురితమైన కథనానికి తహసీల్దార్ మురళీమోహనరావు స్పందించారు. ఈ మేరకు మండల సర్వేయర్ మల్లికార్జున పాణిగ్రాహి, ఆర్‌ఐ రమణమూర్తి, వీఆర్వో ఎస్.నారాయణతో కలిసి సంబంధిత స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ఈ స్థలం చుట్టూ ఉన్న రైతులతో ఆయన మాట్లాడి, వారి అభిప్రాయాలు తీసుకున్నారు. వాస్తవానికి ఇది రోడ్డు పోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇది ప్రభుత్వ స్థలమని అందువలన చదును చేసిన ఖాళీ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ స్థలాన్ని అనుమతి లేకుండా ఎలా చదును చేశారని చదును చేయించిన వజ్జ రంగారావును ప్రశ్నించారు. అయితే తన కొబ్బరి తోటకు ఆనుకొని ఉండడంతో వ్యవసాయేతర అవసరాలకు వాడుకునేందుకు చదును చేసినట్లు ఆయన తెలిపారు.
రైలు ఢీకొని ఆవు మృతి
టెక్కలి రూరల్: స్థానిక తెంబూర్ రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న రైల్వే గేటు సమీపంలో రైలు ఢీకొని ఆవు మృతి చెందింది. మంగళవారం రాత్రి గుణుపూర్ నుంచి నౌపడ వైపు వెళ్లే రాజారాణి ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతి చెందిన ఆవుని బుధవారం జేసీబీ సాయంతో తొలగించి, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. అయితే మృతి చెందిన ఆవు ఎవరిది అనేది తెలియలేదు.
ఆవు మృతదేహాన్ని తొలగిస్తున్న సిబ్బంది
ఆక్రమణ స్థలం పరిశీలన
ఆక్రమణ స్థలం పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment